చాలా కాలం తర్వాత తెర మీదికి ట్రబుల్ షూటర్- కీలక బాధ్యతలు అప్పగింత

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలో మోగబోతోంది. ఫిబ్రవరి తొలి వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వార్డులు, చైర్‌పర్సన్లు, మేయర్ల రిజర్వేషన్లను ఖరారయ్యాయి. 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు, బీసీ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లను నిర్ధారించారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం- 2019 ప్రకారం మహిళలకు 50 శాతం రిజర్వేషన్ తప్పనిసరి చేశారు.

అదే సమయంలో కర్ణాటకలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగబోతోన్నాయి. వీటిని ఎదుర్కొనడం బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో విజయభేరీ మోగించిన బీజేపీ.. ఇప్పుడిక ఈ రెండు రాష్ట్రాల్లో కూడా జయకేతనం ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్ ఆధ్వర్యంలో పార్టీలో పెద్దఎత్తున నియామకాలు చోటు చేసుకున్నాయి.

Ram Madhav Named Bengaluru Civic Poll Incharge Karandlaje Assigned to Kerala by Nitin Nabin

గ్రేటర్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌ పోల్ ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. రాజస్థాన్ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు సతీష్ పూనియా, మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ ఉపాధ్యాయ కో ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది మే 25 తర్వాత జరగనున్న బెంగళూరు మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పత్రాలతో ఓటింగ్ నిర్వహించనున్నారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడేను ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సహ-ఇన్‌ఛార్జ్‌గా ఉంటారు. చండీగఢ్ మేయర్ ఎన్నికను పర్యవేక్షించే బాధ్యతను కూడా తావడేకు అప్పగించారు. ఫిబ్రవరిలో జరగనున్న తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఆశిష్ షెలార్ ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు అశోక్ పర్నామి, రాజ్యసభ ఎంపీ రేఖ శర్మ సహ ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తారు.

మే 25 తర్వాత ఏరోజైనా గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) ఎన్నికలు జరగొచ్చు. ఈసారి ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లను ఉపయోగించనున్నారు. జీబీఏ పరిధిలోని అయిదు మున్సిపల్ కార్పొరేషన్లకు వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాల ప్రచురణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం సైతం ముగిసింది. బ్యాలెట్ పత్రాలకు మారడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దుష్ట కారణాన్ని వెల్లడించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+