రామ మందిర నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది..మోహన్ భాగవత్
అయోధ్యలో రామమందిరం ఎట్టి పరిస్థుతుల్లో నిర్మింపచేస్తామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మరో సారీ స్పష్టం చేశారు. మరోవైపు మందిర నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఎన్డీఏ పూర్తి మెజారీటి వచ్చిన తర్వాత మొదటి సారీ మోహన్ భాగవత్ రామ మందిర నిర్మాణం పై నోరు విప్పారు. ఈనేపథ్యంలోనే ప్రజలు శాంతిసామరస్యలతోపాటు పట్టుదలతో, ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈనేపథ్యంలోనే ఒకవేళ రామమందిర నిర్మాణాన్ని ఆర్ఎస్ఎస్ చేపట్టాలను కుంటే స్వంతగానే నిర్మింపచేస్తామని అన్నారు. లేదంటే ఎవరికైన భాద్యతలు ఇస్తే మాత్రం మందిర నిర్మాణంపై వారు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా తమ లక్ష్యాన్ని చేధించేందుకు కొంత సమయం వేచి ఉండాల్సి వస్తుందని అయన తెలిపారు.

కాగా రామ మందిర నిర్మాణంపై బీజేపీ సైతం 2014తోతోపాటు 2019లో కూడ తమ మ్యానిఫెస్టోలో పెట్టింది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఈ సమస్యను కోర్టు తీర్పు ద్వార పరిష్కరించుకోవాలని భావిస్తున్న విషయం తెలిసిందే.. ఇక దీనిపై మధ్యవర్తుల సహకారంతోనే కేసును పరిష్కరించుకోవాలని సుప్రిం కోర్టు సైతం సూచించింది.












Click it and Unblock the Notifications