వచ్చే దీపావళి కల్లా అయోధ్యలో రామమందిరం సిద్ధం: సుబ్రహ్మణ్య స్వామి
అయోధ్యలో వచ్చే దీపావళి నాటికి రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని బిజెపి రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి సోమవారం అన్నారు.
ఢిల్లీ: అయోధ్యలో వచ్చే దీపావళి నాటికి రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని బిజెపి రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి సోమవారం అన్నారు.
రామ మందిర నిర్మాణం పనులు వచ్చే ఏడాది ఆగస్టులో ప్రారంభమై, దీపావళి నాటికి ముగుస్తాయని చెప్పారు. వచ్చే దీపావళికల్లా మందిరం సిద్ధమవుతుందని చెప్పారు.

రామ జన్మభూమి ప్రాపర్టీ తమదేనంటూ ముస్లీం పార్టీలు చేసిన వాదనను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిందని స్వామి గుర్తు చేశారు. రామ జన్మభూమిలో పూజలు చేసుకోవడంతమ ప్రాథమిక హక్కు అని తాను వాదించానని చెప్పారు.
సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం సాధారణ హక్కులపై ప్రాథమిక హక్కులదే పైచేయి అవుతుందన్నారు. ఈ కారణం చేత ఇకపై కేసు నిలువబోదని, మనమే గెలువబోతున్నామన్నారు.












Click it and Unblock the Notifications