శేఖర్ రెడ్డితో దోస్తీ: ఆయనగారి లీలలు ఇంతింత కాదయా...

ఐటి దాడులతో రామ్మోహన్ రావు కుమారుడు వివేక్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. శేఖర్ రెడ్డితో దోస్తానా కొనసాగిస్తూనే మరోవైపు పెద్ద యెత్తున అక్రమాలకు పాల్పడినట్లు చెబుతున్నారు.

చెన్నై: ఆదాయం పన్ను శాఖ అధికారుల దాడులతో తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్‌రావు కుమారుడు వివేక్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. వివేక్‌కు సంబంధించిన పలు అక్రమాస్తుల వివరాలను ఐటి శాఖ అధికారులు గుర్తించారు. ఇటీవల రామ్మోహన్‌రావు, వివేక్‌ల నివాసాల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ సోదాల సందర్భంగా తిరువాన్మియూరులోని వివేక్‌ నివాసంలో అనేక కీలక పత్రాలను, దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ఐటీ అధికారులు వివేక్‌ పలు అక్రమాలకు పాల్పడినట్లు అంచనాకు వచ్చారు. ఇందుకు తన తండ్రి అధికారాన్ని అనతు వాడుకున్నట్లు అనుమానిస్తున్నారు. బెంగుళూరులో వివేక్‌ 500 లగ్జరీ ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు, తన స్నేహితుడు భాస్కర్‌నాయుడుతో కలిసి బెంగుళూరులోనే ఒక ఆస్పత్రిని, ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీని ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఈ ఆస్పత్రికి కావాల్సిన పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సహాయక సిబ్బందిని ఈ కంపెనీ ద్వారా ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఎంపిక చేస్తున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ వైద్యశాఖ ద్వారా వివేక్‌ రూ.300 కోట్ల మేరకు కాంట్రాక్టులు పొందినట్లు కూడా ఐటి శాఖ అధికారులు గుర్తించారు. భాస్కర్‌నాయుడుతో కలిసి పలు చోట్ల కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు కూడా ప్రచారం సాగుతోంది.

Rammohan Rao's son in trouble with IT raids

దాంతో వివేక్ పెట్టుబడులు, ఇతర ఆస్తుల కొనుగోలుకు సంబంధించి విచారించేందుకు ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని వివేక్‌కు ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది. ఆయన మాత్రం తన భార్య అనారోగ్యంతో ఉందని, విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు.

కాగా, అస్వస్థతకు గురై రామచంద్ర వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామ్మోహన్‌రావును సోమవారం రాత్రి డిశ్చార్జి చేశారు. కాగా సచివాలయంలోని రామ్మోహన్‌రావు కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు జరపడాన్ని అన్నా డీఎంకేకు చెందిన ఓ నేత తొలిసారిగా ఖండించారు.

సచివాలయంలో తనిఖీలు నిర్వహించడం చట్టవిరుద్ధమని ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఎస్‌.ఆర్‌.బాలసుబ్రమణ్యం అన్నారు. తనిఖీలకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందలేదని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకొనే అధికారం ఆదాయపన్ను శాఖకు లేదని అన్నారు.

Rammohan Rao's son in trouble with IT raids

కోట్లాది రూపాయలు, బంగారం కూడబెట్టిన శేఖర్‌రెడ్డి, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి రామ్మోహన్‌రావు కుమారుడు వివేక్‌ల మధ్య సన్నిహిత సంబంధాలున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి లక్కీ నెంబరు, కార్లు నెంబర్లు ఒక్కటేనని ఐటీ దాడుల సందర్భంగా జరిగిన విచారణలో తేలింది.

శేఖర్‌రెడ్డికి రెండు బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లుండగా, అందులో ఓ కారు నెంబరు టీఎన09 సీబీ 0005. ఆ కారును నిరుడు సెప్టెంబరులో చెన్నైలో రిజిస్ట్రేషన్ చేశారు. టీఎన 09 సీకే 0005 నెంబరు కలిగిన మరో కారును 2014 డిసెంబరులో రిజిసే్ట్రషన చేశారు.

కాగా, రామ్మోహనరావు కుమారుడు వివేక్‌ హ్యుండాయ్‌ కారును ఉపయోగిస్తున్నారు. ఆ కారు నెంబర్‌ టీఎన 47 ఏహెచ 0005. ఆ కారును 2013 జూనలో కరూరు రీజినల్‌ ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+