నేడే అయోధ్య ఆలయంలోకి రాములోరి రాక..
ఈ నెల 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇక, అయోధ్య ఆలయంలోకి రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు సర్వం సిద్ధమైంది. అందులో ముఖ్యంగా ఈ రోజు కీలక ఘట్టం జరగనుంది. నేడే అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో శ్రీరాముని విగ్రహాన్ని తీసుకురానున్నారు. రాముడి విగ్రహాన్ని నేడు ఊరేగింపుగా తీసుకురానున్నట్లు అయోధ్య ఆలయ ట్రస్టు పేర్కొనడం జరిగింది.
అయోధ్య ఆలయంలో ప్రతిష్టించే శ్రీరాముని విగ్రహాన్ని కర్ణాటక శిల్పి చెక్కినది. ఇప్పటికే ఈ విషయాన్ని ఆలయ ట్రస్టు ప్రకటించారు. శ్రీరాముని ఫోటోలు మాత్రం ఇప్పటివరకు ఇంకా విడుదల చేయలేదు. నేడు ఈ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టనున్నారు. అయోధ్య గర్భగుడిలో ప్రతిష్టించే రాముని విగ్రహాన్ని నేడు తీసుకురానున్నారు. ఈ నెల 16న నుంచే అయోధ్య రామాలయంలోని విగ్రహ ప్రతిష్టకు క్రతువులు మొదలయ్యాయి.

17నుంచి అంటే నేటి నుంచి రాములోరి విగ్రహాన్ని ఊరేగింపు కార్యక్రమంతో అయోధ్యకు చేరుకోనుంది. ఇప్పటికే అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఆహ్వనపత్రికలపై బలరాముని రూపాలను ముద్రించడ జరిగింది. ఇటీవల సీతారామ, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్న ఓ ఫోటోను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడం జరిగింది. అయితే, అదే విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టాపన చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.
11వేలమంది అతిథులు హాజరుకానున్నారు..
శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని అయోధ్య ఆలయంలో ప్రతిష్టించేందుకు ఎంపిక చేయడం జరిగింది. ఈ శిల్పి కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన వ్యక్తి. ఆ బలరాముని చిత్రాన్ని మాత్రం ఆలయ ట్రస్టు అధికారికంగా ప్రకటించలేదు. 5ఏళ్ల వయసున్న బలరాముడు నిలబడి ఉన్న విగ్రహం మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. ఇక, ఈ అయోధ్య రాములోరి విగ్రహ ప్రతిష్టాపనక ఇప్పటికే అతిరథ మహరథులందరికి ఆహ్వానం అందింది.
ఈ మహత్తర కార్యక్రమానికి 50 దేశాల నుంచి 53 మంది ప్రత్యేక అతిథులు విచ్చేయనున్నారు. సినీ, క్రీడా, రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మొత్తం 11వేలమంది అతిథులు హాజరవుతున్నారు. వీరికి రెండు గిఫ్ట్‌లు కూడా అందించనున్నారు. ఆ రెండు గిప్ట్‌లను కలిపి ఇచ్చేందుకు ప్రత్యేకమైన బ్యాగును కూడా తయారు చేయనున్నారు.












Click it and Unblock the Notifications