మీ సంగతేంటి సర్?: మోడీపై రమ్యకు కోపమొచ్చింది
బెంగళూరు: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన మాండ్య కాంగ్రెసు పార్టీ లోకసభ అభ్యర్థి, ప్రముఖ నటి రమ్యకు కోపం వచ్చింది. మోడీ పైన రమ్య విరుచుకు పడటం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. ఎన్నికల్లో మీ అజెండా ఏమిటని మోడీని రమ్య ప్రశ్నించారు.
రమ్య మాండ్య లోకసభ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఆమె జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా విపక్షాలపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మోడీ పైన ఆమె సెటైర్ వేశారు. మోడీలో ఓ నైపుణ్యం అద్భుతమని, ఎలా తప్పించుకోవాలో ఆయనకు బాగా తెలుసునని ఎద్దేవా చేశారు.

ఆ తర్వాత మోడీ పైన ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. కాంగ్రెసు పార్టీ రాహుల్ గాంధీ ఫ్యూచర్ అనే సింగిల్ అజెండాతో ముందుకు పోతోందని మోడీ చెబుతున్నారని... అయితే మీ సంగతేమిటని ఆమె ట్వీట్ చేశారు.
తాను ఇటీవల అహ్మదాబాదుకు వెళ్లానని, అక్కడ మోడీ చెబుతున్న అభివృద్ధి కనిపించ లేదని ఆమె అన్నారు. అహ్మదాబాదులో పట్టణాభివృద్ధి కనిపించినప్పటికీ.. హ్యూమన్ డెవలప్ మెంట్ మాత్రం లేదన్నారు. కచ్చితమైన లెక్కలు తీస్తే.. గుజరాత్ అభివృద్ధి కర్నాటక కంటే కింద ఉంటుందన్నారు. గుజరాత్ కంటే హర్యానా బాగా అభివృద్ధి చెందిందన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications