లక్షల మంది ముస్లింలకు మోదీ మార్క్ రంజాన్ తోఫా
Ramzan 2025: ముస్లింలు జరుపుకొనే అతి పెద్ద పండుగ.. రంజాన్. నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను పాటించిన అనంతరం భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ నెల 1వ తేదీన నెలవంక కనిపించడంతో ఈ పండగ సందడి ఆరంభమైంది. ఉపవాస దీక్షలు మొదలయ్యాయి.
చంద్ర దర్శనం తరువాతే..
ముస్లింలు నెల రోజుల కాలాన్ని లెక్కించడానికి క్యాలెండర్‌కు బదులుగా చంద్రుడిని ఆధారంగా తీసుకుంటారు. నెలవంక దర్శనంతో ఆరంభం అయ్యే రంజాన్ ఉపవాస దీక్షలను మళ్లీ.. చంద్ర దర్శనం తరువాతే ముగిస్తారు. ఆ మరుసటి రోజే పండగను జరుపుకొంటారు. నెల రోజుల తరువాత కూడా చంద్రుడు కనిపించకపోతే- మరో రోజు ఉపవాస దీక్షలను కొనసాగిస్తారు.

మోదీ సహా..
రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఇదివరకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి నారా లోకేశ్ తదితరులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రార్థనలు ఫలించాలని..
నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో చేసే ప్రార్థనలు ఫలించాలని, ఆ అల్లా దయతో అందరికీ మంచి జరగాలంటూ అభిలాషించారు. అటు హైదరాబాద్‌లో పండగ కోలాహలం కొనసాగుతోంది. రంజాన్ చాంద్ కనిపించిన వెంటనే హైదరాబాద్ పాతబస్తీకి ఒక్కసారిగా తాకిడి పెరిగింది. భారీగా విక్రయాలు నమోదయ్యాయి. ప్రత్యేకించి- పాతబస్తీలో కొనుగోలుదారుల సందడి ఈ నెల రోజుల పాటు కనిపించింది.
మార్కెట్లకు పండగ తాకిడి..
మార్కెట్లన్నీ కళకళలాడాయి. షాపులు రద్దీగా మారాయి. కొనుగోలుదారులతో క్రిక్కిరిసిపోయాయి. చార్మినార్, పరిసర ప్రాంతాల్లో ఈద్ కోలాహలం కనిపించింది. జాతరను తలపించింది. జుమా మసీదును విద్యుద్దీపాలతో అలంకరించారు. రంజాన్ ప్రార్థనల కోసం ఛాదర్లను పరిచారు.
షామియానాలను.
ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించడానికి షామియానాలను వేశారు. అక్కడి ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇక దేశం మొత్తం కూడా రంజాన్ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి సన్నద్ధమౌతోంది.
32 లక్షల మంది పేద ముస్లింలకు..
రంజాన్ పండగను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింలకు నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేయనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరుతో ఈ కిట్లకు సౌగత్-ఇ-మోదీ అని పేరు పెట్టారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన రంజాన్ తోఫాను పోలి ఉంటాయి ఈ కిట్స్.

జేపీ మైనారిటీ వింగ్..
బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కిట్ల పంపిణీ కొనసాగుతుంది. ఈ నెల 31న ఈద్ జరుపుకునే అవకాశం ఉన్నందున.. ఆ రోజున దేశంలోని 32 లక్షల మంది పేద ముస్లిం కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరుతో బహుమతులు అందజేస్తామని బీజేపీ మైనారిటీ వింగ్ జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ తెలిపారు.
సౌగత్-ఎ-మోదీ..
జిల్లా స్థాయిలో సౌగత్-ఎ-మోదీ కిట్లను పంపిణీ చేయడంతో పాటు ఈద్ మిలన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు బీజేపీ మైనారిటీ ఫ్రంట్ వెల్లడించింది. ఈ కిట్లను పంపిణీ చేయడానికి 32,000 మంది పార్టీ కార్యకర్తల సేవలను వినియోగించుకోనుంది బీజేపీ అధిష్ఠానం. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే సందేశాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా దీన్ని నిర్వహించనున్నట్లు జమాల్ సిద్ధిఖీ చెప్పారు.
మహిళలు, పురుషులకు వేర్వేరుగా..
ఈ పండగను పురస్కరించుకుని బీజేపీ జిల్లా స్థాయి నాయకులు ఈ సౌగత్-ఇ-మోదీ కిట్స్‌ను పేద ముస్లింలకు అందజేస్తారు. ఇందులో మహిళలు, పురుషులకు వేర్వేరుగా కిట్స్ అందుతాయి. మహిళలకు అందజేసే వాటిల్లో కొత్త దుస్తులు, సేమియాలు, ఖర్జరపు పండ్లు, డ్రై ఫ్రూట్స్, చక్కెర, శనగపిండి, నెయ్యి లేదా డాల్డా ఉంటాయి.
కుర్తా- పైజామా
పురుషులకు అందజేసే కిట్స్‌లో కుర్తా- పైజామా, సేమియాలు, ఖర్జరపు పండ్లు, డ్రై ఫ్రూట్స్, చక్కెర, శనగపిండి, నెయ్యి లేదా డాల్డా ఉంటాయి. ఒక్కో కిట్ విలువ 500 నుంచి 600 రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. దేశంలో సోదరభావం విలసిల్లేలా, అన్ని మతాలకు అతీతంగా, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలనేదే తమ అభిమతమని జమాల్ సిద్ధిఖీ చెప్పారు.
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications