ఆశ్చర్యం: 5 సబ్జెక్ట్‌లలో సేమ్ మార్కులు సాధించిన ట్విన్ సిస్టర్స్
రాంచీ: జార్ఖండ్ ఐసీఎస్ఈ పరీక్ష ఫలితాల్లో ఆసక్తికర సంఘటన జరిగింది. కవలలైన అక్కా చెల్లెళ్లకు ఐదు సబ్జెక్టుల్లో సమానంగా మార్కులు వచ్చాయి. కేవలం ఒక్క సబ్జెక్టులో మాత్రమే ఒక్క మార్కు తేడా వచ్చింది. దీంతో ఇరువురు కవల అక్కా చెల్లెళ్లు దాదాపు సమానం పర్సెంటేజ్‌తో ఉన్నారు.
అపురూప, అనురూపలు ఇద్దరు ట్విన్ సిస్టర్స్. వీరిద్దరు ఐసీఎస్ఈ పరీక్షల్లో 97.80, 98 పర్సెంటేజ్‌లతో పాస్ అయ్యారు. ఈ ఫలితాలను సోమవారం విడుదల చేశారు.
వీరికి అయిదు సబ్జెక్టుల్లో సమాన మార్కులు వచ్చాయి. ఇరువురు కూడా... ఇంగ్లీష్‌లో 95, సామాన్య శాస్త్రం (సైన్స్)లో 99, గణితంలో 98, చరిత్రలో 97, భూగోళశాస్త్రంలో 97 మార్కులు వచ్చాయి.

ఒక్క హిందీలో మాత్రం అనురూపకు 98 మార్కులు రాగా, అపురూపకు 97 మార్కులు వచ్చాయి. వీరి తండ్రి పేరు శైలేష్ చటోపాధ్యాయ. అతను బిర్సా అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో జంతుశాస్త్రంను బోధిస్తుంటారు.
ఈ అక్కా చెల్లెళ్లు ఎప్పుడు కూడా కలిసి చదువుతుంటారు. ఐసీఎస్ఈ పరీక్షలు మార్చి నెలలో జరిగాయి. పరీక్షల సమయంలో తామిద్దరం కలిసి చదివామని ఆ అక్కా చెల్లెళ్లు చెప్పారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications