బాలికపై రేప్: కామాంధుడిని కొట్టి చంపేశారు
కోహిమా: బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడిని స్థానికులు కొట్టి చంపేసిన సంఘటన నాగాల్యాండ్ లో జరిగింది. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులతో పాటు మిలటరి బలగాలను రంగంలోకి దింపారు.
నాగాల్యాండ్ లోని దీమాపూర్ జిల్లా ధన్ శ్రీషార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఖోకిహు గ్రామంలో హుస్సేన్ ఆలీ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మైనర్ అమ్మాయి మీద ఇతని కన్ను పడింది.

గురువారం రాత్రి ఒంటరిగా ఉన్న బాలికను హుస్సేన్ ఆలీ తన ఇంటికి పిలుచుకుని వెళ్లాడు. తరువాత బాలికను ఇంటిలో నిర్బంధించి అత్యాచారం చేశాడు. బాలిక కనపడకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గాలించారు.
అనుమానం వచ్చి హుస్సేన్ ఇంటిలో పరిశీలించారు. బాలిక రక్తపుమడుగులో పడి ఉన్న విషయం గుర్తించిన గ్రామస్తులు ఆగ్రహంతో అతన్ని పట్టుకుని చితకబాదారు. తీవ్రగాయాలైన హుస్సేన్ ఆలీ ప్రాణాలు వదిలాడు. బాలికను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నామని డిప్యూటి పోలీస్ కమిషనర్ షౌకా కహింటో తెలిపారు.












Click it and Unblock the Notifications