రేప్, హత్యతో వీడి ఇల్లు అంతేనా అంతేనా, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎన్ కౌంటర్, సీఎం దెబ్బతో !

లక్నో/ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాఫియా, గూండాలను నిర్మూలిస్తామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని మట్టిలో పాతిపెడతామని ఇంతకు ముందే చాలాసార్లు చెప్పారు. దీని తరువాత ఘటానుఘటికులైన గ్యాంగ్‌స్టర్లను ఎన్‌కౌంటర్ లో లేపేసిన సీఎం యోగీ ఆదిత్యనాథ్ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీలు పలు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోని సీఎం యోగీ ఆదిత్యనాథ్ గ్యాంగస్టర్ల అంత చూస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ లో అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడి ఇంటిని బుల్డోజర్‌తో ధ్వంసం చేశారు. గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్, బుల్డోజర్ల సందడి తక్కువ అయ్యింది. ఇప్పుడు అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేశారు. 13కి పైగా కేసుల్లో వాంటెడ్ గా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు.

yogiaditya

ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్‌లో 19 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి చంపిన సికందర్ ఖాన్ ఇంటిని బుల్డోజర్ తో నేలమట్టం చేశారు. జూన్ 23వ తేదీన 19 ఏళ్ల యువతిపై సికందర్ ఖాన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫరీద్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో ఓ యువతిని ఈడ్చుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం భవనంలోని సిమెంట్ ఇటుకతో ఆయువతి ముఖం, తల నుజ్జునుజ్జు చేసిన నిందితుడు సికందర్ ఖాన్ అక్కడి నుంచి పరారైనాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స విఫలమై యువతి చనిపోయిందని పోలీసులు అన్నారు. హిందూ యువతిని ప్రేమించినట్లు నాటకం ఆడిన సికందర్ ఖాన్ ఆమె మీద అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అన్నారు. నిందితుడు సికందర్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో సికందర్ ఖాన్ నేరం చేసినట్లు అంగీకరించాడు.

అత్యాచారం, హత్యకు సంబంధించి అనేక ఆధారాలు లభ్యమయ్యాయి, దీని తర్వాత నిందితుడు సికిందర్ ఖాన్ ఇంటిని అధికారులు ధ్వంసం చేశారు.13 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ నిందితుడు గుఫ్రాన్ కౌశాంబి జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. దోపిడీలు, హత్యలు, దారి దోపిడీలు వంటి పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్‌లో ఉన్న గుఫ్రాన్‌పై పోలీసులు దాడి చేశారు

jcb11

గుఫ్రాన్ ఉంటున్న ఇంటి గురించి సమాచారం అందుకున్న పోలీసులు నేరుగా దాడి చేశారు. తెల్లవారుజామున 5 గంటలకు పోలీసులు దాడి చేశారు. ఈసారి గుఫ్రాన్ ఎదురుదాడికి దిగాడు. కాల్పుల్లో గుఫ్రాన్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు గుఫ్రాన్‌ను అదుపులోకి తీసుకుని ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది.

క్రిమినల్ గుఫ్రాన్ అరాచకాలు చాలా ఎక్కువ కావడంతో అతను పోలీసులకు పెద్ద తలనొప్పిగా తాయారైనాడు. గుఫ్రాన్ తలపై రూ. ఒక లక్ష రివార్డు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ రెండు కేసులు మళ్లీ కలకలం సృష్టించాయి. మొత్తం మీద ఒకే రోజు రేప్, హత్య కేసులో నిందితుడిని నేలమట్టం చెయ్యడం, క్రిమినల్ ను ఎన్ కౌంటర్ లో అంతం చెయ్యడం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+