మహిళా ఎస్ఐ మీద అత్యాచారం చేసిన టీవీ చానల్ రిపోర్టర్, ధిక్కున్నచోట చెప్పుకో!
బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళా పోలీసు అధికారి మీద అత్యాచారం చేశారని ఓ ప్రైవేటు టీవీ చానల్ రిపోర్టర్ మీద మైసూరు నగరంలో కేసు నమోదు అయ్యింది. పెళ్లి ముసుగులో అత్యాచారం చెయ్యడమే కాకుండా నీకు ధిక్కున్న చోట చెప్పుకో అంటూ టీవీ చానల్ రిపోర్టర్ ఎదురు తిరిగాడు. అత్యాచారం, మోసం చేశారని కేసు నమోదు కావడంతో టీవీ చానల్ రిపోర్టర్ మాయం అయ్యాడు.

మహిళా ఎస్ఐ
మైసూరులోని ఉదయగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విడాకులు తీసుకున్న మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ నివాసం ఉంటున్నారు. ఓ ప్రైవేటు టీవీ చానల్ లో రిపోర్టర్ గా పని చేస్తున్న వ్యక్తికి ఇప్పటికే వివాహం అయ్యింది. అయితే తనకు పెళ్లి కాలేదని టీవీ చానల్ రిపోర్టర్ మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ ను నమ్మించి దగ్గర అయ్యాడని ఆరోపణలు ఉన్నాయి.

చావు కబురు చల్లాగా చెప్పాడు
పెళ్లి చేసుకుంటానని మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ ను నమ్మించిన టీవీ చానల్ రిపోర్టర్ ఇప్పటికే అనేక సార్లు ఆమె మీద అత్యాచారం చేశాడని సమాచారం. తీరా పెళ్లి చేసుకోవాలని మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ ఒత్తిడి చెయ్యడంతో టీవీ చానల్ రిపోర్టర్ తనకు ఇప్పటికే పెళ్లి అయ్యిందని చావు కబురు చల్లాగా చెప్పాడు.

ధిక్కున్న చోట చెప్పుకో
నిన్ను పెళ్లి చేసుకోవడం వీలుకాదని, నీకు ధిక్కున్నచోట చెప్పుకోవాలని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ప్రైవేటు టీవీ చానల్ రిపోర్టర్ ఎదురుతిరిగాడు. విధిలేని పరిస్థితుల్లో మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ మైసూరులోని ఉదయగిరి పోలీస్ స్టేషన్ లో ప్రైవేట్ టీవీ చానల్ రిపోర్టు మీద ఫిర్యాదు చేశారు.

మాయం అయిన రిపోర్టర్
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అత్యాచారం చేశాడని ప్రైవేటు టీవీ చానల్ రిపోర్టర్ మీద ఐపీసీ 376, 354, 420, 496 సెక్షల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన మీద కేసు నమోదు చేశారని విషయం తెలుసుకున్న ప్రైవేటు టీవీ చానల్ రిపోర్టర్ మాయం అయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని మంగళవారం ఉదయగిరి పోలీసులు తెలిపారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications