ఆడపిల్లకు బుద్ధి నేర్పితేనే అత్యాచారాలు తగ్గుతాయి, ప్రభుత్వ చర్యలతోకాదు: బీజేపీ ఎమ్మెల్యే
ఉత్తరప్రదేశ్ లోని హాత్రస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారం, హత్య ఉదంతంపై దేశమంతటా ఆగ్రహావేశాలు ఎగిసిపడుతుండటం, యోగి సర్కారు తీరు, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వాధికారులు బెదిరిస్తున్న వైనంపై విమర్శలు వస్తున్న తరుణంలో అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రేప్ కేసులపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ లో తరచూ గ్యాంగ్ రేపులు జరుగుతుండటం, వాటిని అడ్డుకోవడంలోగానీ, బాధితులకు సాయం చేయడంలోగానీ యోగి సర్కారు దారుణంగా ఫెయిలైందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న వేళ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. యూపీలో రామరాజ్యం కొనసాగుతోందని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నా, ఆడవాళ్లపై అత్యాచారాలు ఎందుకు కొనసాగుతున్నాయంటూ మీడియా అడిగి ప్రశ్నలకు ఆ ఎమ్మెల్యే ఇచ్చిన సమాధానం ఇది..

''రేప్ కేసులు తగ్గాలంటే ఒకటే మార్గముంది. అందరు తల్లిదండ్రులు తమ కూతుళ్లకు మంచి బుద్దులు చెప్పాలి. వారికి భారతీయ సంప్రదాయాలు, విలువలు నేర్పించాలి. అప్పుడు మాత్రమే అత్యాచారాలు తగ్గుతాయి. అంతేగానీ, ప్రభుత్వం ఏదో చర్యలు తీసుకున్నంత మాత్రాన ఇవి ఆగవు. ఒక ఎమ్మెల్యేగానేకాదు, పిల్లకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడిగానూ నేనీ మాట చెబుతున్నాను.. సంస్కృతి, విలువలతోనే రేప్ కేసులకు అడ్డుకట్ట వేయగలం. ప్రభుత్వం తల్వార్(కత్తి) ఉపయోగించినా ఎలాంటి ఫలితం ఉండదు'' అని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.
టీచర్ ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యే అయిన సురేంద్ర సింగ్.. అత్యాచారాలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. యోగి సర్కారు తీరుకు బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని పలువురు విపక్ష నేతలు అన్నారు. సురేంద్ర సింగ్ గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీని చంపిన గాగ్సే ఉగ్రవాది కాదని, అతను చేసింది చాలా చిన్న తప్పేనని ఈ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications