బాలికపై అత్యాచారం, హత్య, కన్న తల్లిని చంపేశాడు, తండ్రి హత్యకు టెక్కీ కుట్ర !

Recommended Video

    ఒక చిన్న పిల్లను రేప్ చేసి కాల్చేసిన దుర్మార్గుడు, చివరికి తల్లిని కూడా ?

    చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని మాంగాడు సమీపంలోని ముగిలివాక్కంలో చిన్నారి హాసిని (6)పై గత ఫిబ్రవరి 5న అత్యాచారం జరిపి హత్య చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు దశ్వంత్ చివరికి అతని తల్లిని దారుణంగా చంపేశాడు. పోలీసుల విచారణలో తన తండ్రిని కూడా హత్య చెయ్యాలని ప్లాన్ వేశానని, ఆ ప్లాన్ రివర్స్ అయ్యిందని దశ్వంత్ అంగీకరించడంతో పోలీసులు హడలిపోయారు.

    చిన్నారిని చంపేశాడు

    చిన్నారిని చంపేశాడు

    కిరాతకుడు దశ్వంత్‌ చెన్నైలో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తన తండ్రిని కూడా హత్య చెయ్యాలని ప్లాన్ వేశానని, అయితే ఆయన తప్పించుకున్నారని చెప్పాడు. చెన్నైలో హాసిని అనే ఆరేళ్ల బాలికను, కన్నతల్లిని కిరాతకంగా హత్యచేసిన దశ్వంత్ ముంబైకి పారిపోయాడు.

     ముంబైలో చిక్కాడు

    ముంబైలో చిక్కాడు

    పోలీసులు దశ్వంత్ కోసం గాలించి ముంబైలో అరెస్టు చేశారు. తమిళనాడు పోలీసులు ముంబై కోర్టులో దశ్వంత్ ను హాజరుపరిచి తరువాత అతన్ని చెన్నైకి విమానంలో తీసుకువచ్చారు. కుండ్రత్తూరు పోలీస్ స్టేషన్ లో కిరాతకుడు దశ్వంత్ ను పోలీసులు 12 గంటల పాటు విచారణ చేసి వివరాలు బయటకు లాగడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    అత్యాచారం, హత్య చేసిన టెక్కీ

    అత్యాచారం, హత్య చేసిన టెక్కీ

    దశ్వంత్ ముందుగా ఆయన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో మాంగాడు సమీపానగల ముగిలివాక్కంలో చిన్నారి హాసిని (6)పై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో తనను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారని చెప్పాడు.

     రోజుకు రూ. 3 వేలు ఖర్చు !

    రోజుకు రూ. 3 వేలు ఖర్చు !

    బెయిల్ మీద బయటకు వచ్చిన తనను తల్లిదండ్రులు రోజూ తిడుతూ ఉండేవారని దశ్వంత్ చెప్పాడు. విలాసవంతమైన జీవితానికి డబ్బు అవసరం కావడంతో తండ్రిని ప్రతిరోజు రెండు, మూడు వేల రూపాయలు ఇవ్వాలని కోరానని, దీనికి ఆయన నిరాకరించడంతో హతమార్చేందుకు ప్లాన్ వేశానని దశ్వంత్ అంగీకరించాడు.

    తల్లితో పాటు తండ్రిని !

    తల్లితో పాటు తండ్రిని !

    డిసెంబర్ 2వ తేదీన తన తల్లిని హతమార్చిన రోజు తండ్రి తొందరగా పనికి వెళ్లడంతో తప్పించుకున్నాడని, లేదంటే అదే రోజు తన తండ్రిని దారుణంగా చంపేవాడినని దశ్వంత్ చెప్పడంతో పోలీసులు షాక్ కు గురైనారు. ఆరేళ్ల చిన్నారి హాసినిపై అత్యాచారం చేసిన కామాంధుడు టెక్కీ దశ్వంత్ తరువాత అతని తల్లిని హత్య చేసి ముంబై పారిపోయాడు.

     చితకబాదిన బంధువులు

    చితకబాదిన బంధువులు

    దశ్వంత్ ను కోర్టుకు తీసుకు వచ్చిన సమయంలో చిన్నారి హాసిని కుటుంబ సభ్యులు, బంధువులు దశ్వంత్ ను చితకబాదేశారు. నిందితుడు దశ్వంత్ ను కోర్టులో హాజరుపరచగా డిసెంబర్ 22వ తేదీ వరకు అతన్ని రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+