వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమతను కలిచివేసిన ‘రేప్’ కామెంట్స్: తపస్ వివరణ

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు తపస్ పాల్ వ్యాఖ్యలు ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తీవ్రంగా కలచివేశాయని, ఆయనపై ఏం చర్యలు తీసుకోవాలనే అంశంపై పార్టీ రేపు (బుధవారం) నిర్ణయం తీసుకుంటుందని తృణమూల్ వర్గాలు తెలిపాయి. తపస్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా స్పందించలేదు. అయితే తాము హింసాకాండ, అశ్లీలతకు వ్యతిరేకమని ఓ ప్రకటనలో తెలిపారు.

తపస్ పాల్ తమ పార్టీ కార్యకర్తల సదస్సులో మాట్లాడుతూ.. పార్టీ ప్రత్యర్థుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మీరు(ప్రత్యర్థి పార్టీవారు) మా కార్యకర్తలపై దాడులు చేసి భయపెడితే వూరుకునేది లేదు. నేనూ మా మనుషులను ఎగదోయగలను. వారు మీ ఇళ్ల మీద దాడి చేసి ఆడవారిపై అత్యాచారాలు చేస్తారు' అంటూ తపస్ మండిపడ్డారు. అయితే అతను మాట్లాడినదంతా ఓ స్మార్ట్ ఫోన్‌లో రికార్డై అన్ని పార్టీల నేతలకు సర్క్యులేట్ అయింది. దీంతో ఆయనపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.

Rape remark: Tapas Pal's wife apologises, Mamata still silent

తపస్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా డిమాండ్ చేశారు. ఎంపి తపస్ వ్యాఖ్యలు దారుణమని, ఆయనని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు మమతా శర్మ, సిపిఎం నేత బృందాకారత్‌లు డిమాండ్ చేశారు.

ఇది ఇలా ఉండగా తపస్ పాల్ వ్యాఖ్యలను ఆయన భార్య నందిని కూడా తప్పుపట్టారు. ఆయన తరపున తాను క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఒక ఎంపి అయి ఉండి అలా మాట్లాడటం సరికాదన్నారు. అయితే ఆయన మంచి వ్యక్తేనని, అలా ఎప్పుడూ మాట్లాడరని అన్న ఆమె.. ఓ ఎంపీ అలా మాట్లాడేందుకు దారి తీసిన పరిస్థితులేంటో తెలుసుకోవాలని కోరారు. కాగా, తాను రేప్ పదం వాడలేదని, దాడి చేస్తానని మాత్రమే అన్నానని ఎంపి తపస్ పాల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యల పట్ల పార్టీకి, మీడియాకు క్షమాపణలు చెప్పారు. తపస్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

English summary
Following Trinamool Congress MP Tapas Pal's rape threat to CPI-M activists, a beleaguered TMC has now decided to hold a meeting on Wednesday chaired by party chief and West Bengal CM Mamata Banerjee to discuss the future course of action, Times Now reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X