కిరాతకం: ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న 8 నెలల పాప
న్యూఢిల్లీ: ఢిల్లీలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఎనిమిది నెలల పాపపై అత్యాచారం జరిగింది. పాపను స్థానిక ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు. ఆమెకు శస్త్రచికిత్స చేశారు. పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
పాప కుటుంబం నివసించే భవనంలోనే ఉంటున్న 28 ఏల్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు పిటిఐ వార్తాసంస్థ తెలిపింది. అతను నేరం అంగీకరించాడు. ఈ సంఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
రాజధానిలో 8 ఏళ్ల పాపను కిరాతకంగా రేప్ చేశారని, ఆస్పత్రిలో ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది, ఆమెన చూడడానికి ఆస్పత్రికి వెళ్తున్నానని, నోట మాట రావడం లేదని, ఆమెను చూడడానికి భయపడుతున్నానని, ఆమె దయచేసి ప్రార్థించండని సవాతి మాలివాల్ అన్నారు.

పాప తండ్రి కూలీ పనిచేస్తుంటాడు. పశ్చిమ ఢిల్లీలో గల సుభాష్ నగర్‌లోని ఇంట్లో పాప ఆదివారంనాడు ఒంటరిగా ఉంది. ఇళ్లలో పని చేసే తల్లి తిరిగి వచ్చి చూసేసరికి పాప రక్తమోడుతూ కేకలు విలపిస్తూ కనిపించింది.
ఆమెతో ఆమె కజిన్ ఆడుకోవడం చూసినట్లు బంధువైన మహిళ చెప్పింది. వెంటనే పాప తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పాపపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. సంఘటన తర్వాత పారిపోయిన నిందితుడిని పోలీసులు ఆ తర్వాత అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications