Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూపీలో అరుదైన సీన్‌ : సలాం.. రామ్ రామ్.. అఖిలేశ్‌, ప్రియాంక పరస్పర అభివాదం

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీన్నీ తలమునకలై ఉన్నాయి. అధికారాన్ని మరో సారి కైవసం చేసుకునేందుకు కాషాయ దళం జోరుగా ప్రచారం చేస్తోంది. పార్టీ ఆగ్ర నేతలు సైతం రంగంలోకి దిగారు. కేంద్రం హోం మంత్రి అమిత్ షా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా హామీలు గుప్పిస్తూ ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. అటు కాంగ్రెస్ పార్టీ తమ పట్టుకు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యూపీ ఎన్నికల్లో అన్ని తానై పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.

ప్రచారంలో ప్రియాంక దూకుడు

యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ దూసుకెళ్తున్నారు. మొత్తం 403 స్థానాలకు గాను 402 అసెంబ్లీ స్థానాలలో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపారు. రైతును, నిరుద్యోగులను, మహిళలను కలసుకుంటున్నారు. బీజేపీ పాలనపై పదునైన విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. యోగీ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమిలేదని ఆరోపణలు గుప్పించారు. అభివృద్ధిని పక్కన పెట్టి.. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆరోపణలు గుప్పించారు

ఆసక్తికర దృశ్యం.. అఖిలేశ్, ప్రియాంక పరస్పర అభావాదం

అయితే యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరుదైన సీన్ చోటు చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రచారంలో ఎదురెదురు పడ్డారు. పరస్పరం అభివాద చేసుకున్నారు. ఈ ఆసక్తికర దృశ్యం బులంద్‌శహర్‌లో చోటు చేసుకుంది. జయంత్‌ చౌదరితో కలిసి అఖిలేశ్‌ యాదవ్ ప్రచారం నిర్వహిస్తుండగా.. ప్రియాంక గాంధీ కూడా తన వాహనశ్రేణితో అటువైపు వచ్చారు. దీంతో ముగ్గురు నేతలు పరస్పరం అభివాదం చేసుకున్నారు. అక్కడే ఉన్న సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ పార్టీల కార్యకర్తలు ఈలలు వేస్తూ..జెండాలు ఊపుతూ ఆనందోత్సాహాలతో ముందుకు సాగారు. ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన ఫొటోను అఖిలేశ్‌యాదవ్.. వీడియోను ప్రియాంక గాంధీ తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

Recommended Video

    UP Elections 2022: Amit Shah Cautions RLD's Jayant Chaudhary|Akhilesh Yadav | Oneindia Telugu
     ఏడు దశల్లో యూపీ ఎన్నికలు

    ఏడు దశల్లో యూపీ ఎన్నికలు

    ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ దళ్ తో కలిసి సమాజ్ వాదీ పార్టీ పోటీకి దిగాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు అధికార బీజేపీకి, అఖిలేశ్ నేతృత్వంలోని కూటమికి మధ్యే ప్రధాన పోటీ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా , ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్ యాదవ్, ప్రియాంక గాంధీలే ప్రధాన లక్ష్యంగా చేసుకుని బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+