కేన్స్ వేదికపై పోచంపల్లి ఇక్కత్ హవా.. తెలంగాణ చేనేత కళకు హాలీవుడ్ స్టార్స్ ఫిదా !!
ప్రపంచ సినీ, ఫ్యాషన్ రంగాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 79వ అంతర్జాతీయ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై ఈసారి తెలంగాణ చేనేత కళ తన ప్రత్యేక ముద్ర వేసింది. సంప్రదాయం, సంస్కృతి, కళాత్మకత కలగలిపిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు కేన్స్ రెడ్ కార్పెట్‌పై మెరిసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. మిస్ ఇండియా స్టార్ యూనివర్స్-2018 రష్మీ ఠాకూర్ ధరించిన ఈ ప్రత్యేక దుస్తులు భారతీయ చేనేత కళాకారుల ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పాయి.
'పోచంపల్లి టు కేన్స్' థీమ్..
ఫ్రాన్స్‌లోని కేన్స్ నగరంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2026లో రష్మీ ఠాకూర్ 'పోచంపల్లి టు కేన్స్' అనే ప్రత్యేక థీమ్‌తో రెడ్ కార్పెట్‌పై నడిచారు. దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగిన పోచంపల్లి ఇక్కత్ చేనేత వస్త్రాలను ఆధునిక ఫ్యాషన్ శైలిలో మేళవించి రూపొందించిన కూచర్ డిజైన్ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ గ్రామీణ కళను అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై నిలబెట్టే ప్రయత్నంగా ఈ ప్రదర్శన నిలిచింది. సంప్రదాయ నేసిన ఆకృతులు, రేఖాగణిత నమూనాలు, ప్రత్యేక రంగుల కలయిక ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి.

ప్రపంచ 'సిల్క్ సిటీ'గా పోచంపల్లి..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి, చౌటుప్పల్ ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా చేనేత కళకు ప్రసిద్ధి చెందాయి. 'సిల్క్ సిటీ'గా గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్ చేనేతకు ఇప్పటికే జీఐ (భౌగోళిక గుర్తింపు) ట్యాగ్ లభించింది. ఈ ప్రత్యేక గుర్తింపు భారతీయ హస్తకళ వారసత్వానికి చిహ్నంగా నిలుస్తోంది. చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో రష్మీ ఠాకూర్‌ను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాదీ ముత్యాలు..
రష్మీ ఠాకూర్ ధరించిన ఇక్కత్ వస్త్రాలకు హైదరాబాదీ ముత్యాలు, నిజాం కాలం నాటి వారసత్వ ఆభరణాలు మరింత రాజసాన్ని తీసుకొచ్చాయి. సంప్రదాయ ఆభరణాలను ఇక్కత్ డిజైన్‌లకు అనుగుణంగా అలంకరించడం ద్వారా భారతీయ శిల్పకళ వైభవం అంతర్జాతీయ వేదికపై ప్రతిఫలించింది. తెలంగాణ చేనేత, హైదరాబాద్ ముత్యాలు, నిజాం సంస్కృతి.. ఈ మూడు కలయిక కేన్స్ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ ఫ్యాషన్‌కు ఇది ఒక గ్లోబల్ స్టేట్‌మెంట్‌గా మారింది.
రష్మీ ఠాకూర్ కామెంట్స్..
కేన్స్ రెడ్ కార్పెట్‌పై పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో నడవడం తనకు గర్వకారణమని రష్మీ ఠాకూర్ తెలిపారు. "ఇది కేవలం నా వ్యక్తిగత విజయమే కాదు. తెలంగాణ చేనేత కళకు అంతర్జాతీయ వేదికపై జరిగిన గొప్ప ఆరంగేట్రం. పోచంపల్లి నేతన్నలు తమ శ్రమ, కళాత్మకతను ప్రతి దారంలో నింపారు. వారి ప్రతిభకు ఇది ప్రపంచ స్థాయి గుర్తింపు" అని ఆమె పేర్కొన్నారు. అలాగే "మన చేనేతను హైదరాబాద్ ముత్యాలతో మేళవించడం భారతీయ హస్తకళకు నిజమైన గౌరవం. ప్రపంచానికి మన సంస్కృతి గొప్పదనాన్ని చూపించే అవకాశం ఇది" అని ఆమె భావోద్వేగంగా చెప్పారు.
కేన్స్ వంటి ప్రపంచ స్థాయి వేదికపై పోచంపల్లి ఇక్కత్ మెరవడం వల్ల తెలంగాణ చేనేత రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనర్లు, బ్రాండ్లు భారతీయ హ్యాండ్లూమ్‌పై మరింత ఆసక్తి చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది కేవలం ఒక ఫ్యాషన్ ప్రదర్శన మాత్రమే కాదు.. గ్రామీణ నేతన్నల కష్టానికి ప్రపంచం ఇచ్చిన గౌరవం అని కొనియాడుతున్నారు. చేనేత రంగానికి కొత్త మార్కెట్లు, ఎగుమతి అవకాశాలు, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే చారిత్రాత్మక ఘట్టంగా ఈ ప్రదర్శన నిలిచిందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications