రాష్ట్రపతి సిబ్బంది క్వార్టర్స్‌లో ఉద్యోగి మృతదేహం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవనంలోని సిబ్బందిని చెందిన క్వార్టర్స్‌లోని ఓ గదిలో శుక్రవారం ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అది రాష్ట్రపతి సెక్రటేరియట్‌లో పనిచేస్తోన్న నాలుగో తరగతి ఉద్యోగికి చెందినదిగా పోలీసులు వెల్లడించారు.
సిబ్బందికి చెందిన క్వార్టర్స్ నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల గదుల్లోని వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటికి తెచ్చారు. ఆ గది లోపలి నుంచి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

ఈ మృతి వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని పోలీసులు భావిస్తున్నారు. ఆ గదుల్లో ఉండే ఉద్యోగి కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులు ఊరిలో లేకపోవడంతో ఈ విషయం వెలుగులోకి రాలేదని, అతడు మరణించి రెండు, మూడు రోజులై ఉండొచ్చని తెలిపారు.












Click it and Unblock the Notifications