ముస్లింలు తయారుచేసే రావణ ప్రతిమలు.. ఎక్కడో తెలుసా..?
దేశవ్యాప్తంగా దసర సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా విజయదశమిని జరుపుకుంటున్నారు. ఈ పండుగ సందర్భంగా అమ్మవారి రూపాల్లో కొలువైన విగ్రహాలను నిమజ్జనం చేయడం జరుగుతుంది. అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో రావణాసుడి దహన కార్యక్రమం ఉంటుంది. ఎలాగైతే అమ్మవారి విగ్రహాలను తయారుచేస్తారో, అదేవిధంగా రావణాసురిడి బొమ్మల తయారీ కూడా ఉంటుంది.అయితే, అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేయడం ఆనవాయితీ.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి నాడు రావణాసుడి దిష్టిబొమ్మ దహనం కూడా చేస్తారు. అయితే, రావణాసుడి బొమ్మలను తయారీలో ఎక్కువుగా హిందువులే ఉండడం మనం చూస్తుంటాం. కానీ, దేశంలోని ఈ ప్రాంతంలో మాత్రం ముస్లింలు రావణ ప్రతిమలను తయారుచేస్తారు. అంతేకాదండోయ్, పంజాబీ వాసులు ఈ బొమ్మలను దహనం చేస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ ప్రాంతంలో దసరా నిలుస్తోంది.. రండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

పంజాబీ సమాజ్ నిర్వహణలో..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రావణ దహన కార్యక్రమాన్ని ప్రతిఏటా భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. దసరా రోజున రావణ దహనం దాని ప్రత్యేక వైభవాన్నికలిగి ఉంటుంది. గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా విజయదశమి పండుగను వివిధ రకాలుగా జరుపుకుంటున్నారు ప్రజలు. ఈ పండుగ సందర్భంగా శాస్త్రపూజ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆనంద్‌లోని అరోరా పంజాబీ సమాజ్ దసరా రోజున 68వ రావణ దహన కార్యక్రమాన్నినిర్వహించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. దీంతో పాటు ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులో, పంజాబీ డ్రమ్స్‌పై పంజాబీ రాస్‌లు పాడడం ఆనవాయితీ.
51 అడుగుల రావణ విగ్రహం..
అదేవిధంగా, ప్రతి ఏటా గుజరాత్‌లోని ఈ ప్రాంతంలో ముస్లిం కళాకారులు రావణుడి విగ్రహాన్ని తయారుచేస్తారని ఆనంద్ అరోరా పంజాబీ సమాజ్ అధ్యక్షుడు నిషిత్ భాయ్ అరోరా తెలిపారు. ఈ ముస్లిం కళాకారులు యూపికి చెందినవారు. అయితే వీరు ప్రస్తుతం అహ్మదాబాద్‌లో స్థిరపడ్డారు. యూపీకి చెందిన ముస్లిం కళాకారులు ఆనంద్‌లోని 51 అడుగుల రావణ విగ్రహాన్ని పూర్తి చేశారని ఆయన తెలిపారు. ఆనంద్ వద్ద రావణ విగ్రహాలను ముస్లిం కళాకారులు చాలా సంవత్సరాలుగా తయారు చేస్తున్నారని, ఈ కళాకారుల పనిని చూసేందుకు చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తారని ఆయన అన్నారు.
అయితే ఈ భారీ రావణ ప్రతిమను చేసేందుకు ఈ ముస్లింలకు చాలా రోజుల సమయమే పట్టిందట...! ఈ ఏడాది రావణ దహన కార్యక్రమం గుజరాత్‌లోని జిమ్నాసియం స్కూల్‌లో నిర్వహిస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయని అరోరా తెలిపారు. ఈ రావణ విగ్రహాన్ని అరోరా పంజాబీ సమాజ్ సిద్ధం చేసింది. ఈ దహన కార్యక్రమాన్ని కూడా పంజాబీ వాసులే చేస్తారట..ఇరవైవేలమందికి పైగా నగరవాసులు ఈ రావణాసుడి దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications