అతనో పిచ్చోడు: మరోసారి నోరుపారేసుకున్న శివసేన ఎంపీ గైక్వాడ్

సిబ్బందిపై దాడి చేసి ఇటీవల ఎయిర్‌ ఇండియా నిషేధానికి గురైన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ తాజాగా మరోసారి నోరు పారేసుకున్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

ముంబై: సిబ్బందిపై దాడి చేసి ఇటీవల ఎయిర్‌ ఇండియా నిషేధానికి గురైన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ తాజాగా మరోసారి నోరు పారేసుకున్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు గౌరవానికి భంగం వాటిల్లినందుకు మాత్రమే తాను క్షమపణలు చెబుతానన్నాని పేర్కొన్నారు.

దీనికి తోడు ఎయిర్‌ఇండియా ఉద్యోగులు పిచ్చివాళ్లని అన్నాడు. వారు వివాదాన్ని ప్రారంభిస్తే తాను ఎందుకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు సూచన మేరకు గైక్వాడ్‌ పేరు ఎయిర్‌ ఇండియా తన నిషేధిత వ్యక్తుల జాబితా నుంచి తొలగించింది. మరుసటి రోజే గైక్వాడ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Ravindra Gaikwad calls AI official, whom he allegedly beat, ‘mad’

ఎయిరిండియా మేనేజర్ శివకుమార్ పిచ్చోడంటూ గైక్వాడ్ నోరుపారేసుకున్నారు. అంతేగాక, శివకుమార్‌కు గొడవలు కొత్తేం కాదని అన్నారు అతనిపై ఇలాంటి కేసులు 8 ఉన్నాయన్నారు.

ఇది ఇలా ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ డోలా సేన్ విమాన సిబ్బందితో గొడవకు దిగారు. ఆమె ఢిల్లీ నుండి కోల్ కతా వెళ్ళే ఎయిరిండియా విమానాన్ని శుక్రవారం నాడు ఎక్కారు. డోలా సేన్ తన తల్లిని అత్యవసర ద్వారం వద్ద కూర్చోబెట్టారు.

అయితే ఎయిరిండియా సిబ్బంది మాత్రం అత్యవసర ద్వారం వద్ద డోలాసేన్ తల్లిని కూర్చోబెట్టకూడదని వేరే చసీటును కేటాయిస్తామని చెప్పారు.అయితే ఈ విషయమై ఆమె ఎయిరిండియా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎయిరిండియా సిబ్బందితో ఆమె గొడవ పడడం వల్ల సుమారు 30 నిమిషాల పాటు విమానం ఆలస్యమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+