ఈఎంఐలపై ఆర్బీఐ కీలక నిర్ణయం?

RBI repo rate 2025: భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించింద. 25 బేసిస్ పాయింట్ల మేర కుదించింది. ఆర్బీఐ రెపొ రేట్‌ను తగ్గించడం వరుసగా ఇది రెండోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్ర బాధ్యతలను స్వీకరించిన తరువాత దీన్ని తగ్గించడం ఇది రెండోసారి. దీనివల్ల ఈఎంఐల భారం కొంత మేర తగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025- 2026లో ఆర్బీఐ ప్రకటించిన మొట్టమొదటి మానిటరింగ్ పాలసీ ఇదే. ఇందులో రెపొ రేట్ల తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న చర్యలు.. మున్ముందు ఆర్థిక విధానాలు ఎలా ఉంటాయనేది చెప్పకనే చెప్పినట్టయింది. మానిటరింగ్ పాలసీని న్యూట్రల్ నుండి అకామడేటివ్ బదలాయించడం చర్చనీయాంశమౌతోంది.

RBI cuts key interest rates by 25 basis points

ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మానిటరింగ్ పాలసీ విధానాన్ని కొద్దిసేపటి కిందటే ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వాస్తవ స్థూల జాతీయోత్పత్తి 6.5 శాతంగా అంచనా వేసినట్లు వెల్లడించారు. తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్-మే-జూన్ కాలానికి 6.5 శాతం మేర జీడీపీ నమోదవుతుందని అభిప్రాయపడ్డారు.

రెండో త్రైమాసికంలో 6.7, మూడో త్రైమాసికంలో 6.6, చివరి త్రైమాసికంలో 6.3 శాతం మేర జీడీపీ వృద్ధి రేటు నమోదవుతుందని సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈ మేరకు ప్రాథమిక అంచనాలను రూపొందించుకున్నట్లు వివరించారు. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా అలముకున్న ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని, జీడీపీ అంచనాలను అవి ప్రభావితం చేయవచ్చని పేర్కొన్నారు.

ఫిబ్రవరిలో ప్రకటించిన మానిటరింగ్ పాలసీలో ప్రకటించిన జీడీపీ అంచనా 6.7 శాతంతో పోలిస్తే 20 బేసిస్ పాయింట్లు తగ్గిందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక స్థితిగతులు, ఎగ్జిమ్ విధానాలు, వాటిపై ఆధారపడి కార్యకలాపాల్లో చోటు చేసుకున్న పరిణామాలు, వాటి ప్రభావాలకు ఈ తగ్గింపు అద్దం పట్టినట్టయిందని వ్యాఖ్యానించారు.

చిన్న, మధ్య తరహా వ్యాపార కార్యకలాపాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, హౌసింగ్, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ సెగ్మెంట్‌లో పెట్టుబడులు, అందులో సంభవించే వ్యయాలపై పడే ప్రతికూల ప్రభావం వృద్ధిరేటును తగ్గిస్తుందని సంజయ్ మల్హోత్ర పేర్కొన్నారు. వివిధ దేశాల మధ్య నెలకొన్న ట్రేడ్ వార్ కారణంగా ప్రపంచ వృద్ధి మందగించిందని, దీని ప్రభావం దేశీయ వృద్ధికి అడ్డంకిగా మారిందని చెప్పారు.

అత్యధిక టారిఫ్‌ను ఎదుర్కొనాల్సి రావడం వల్ల నికర ఎగుమతులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని సంజయ్ మల్హోత్ర స్పష్టం చేశారు. ఇతర దేశాల రెసిప్రోకల్ టారిఫ్‌ను పోల్చిచూస్తే భారత్‌లోనే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. దేశం విదేశీ వాణిజ్య ఒప్పందాలపై అమెరికా తీసుకుంటోన్న నిర్ణయాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+