లేపేస్తాం!, ఎక్కువ డబ్బులిస్తే ఆలోచిస్తా: ఆర్బీఐ గవర్నర్ రాజన్‌కు బెదిరింపు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్‌కు బెదిరింపి ఈ మెయిల్స్ వచ్చాయి. రాజన్‌కు తన పర్సనల్ మెయిల్ ఐడీకి బెదిరింపు సందేశం వచ్చింది. ఈ నెల ప్రారంభంలో ఈ మెయిల్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అతనిని లేకుండా చేస్తామని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మెయిల్ 'ఐడీ ఐఎస్ఐఎస్583847' అనే జీ మెయిల్ నుండి వచ్చింది.

ఈ మెయిల్‌లో ఉన్న సమాచారం మేరకు... నిన్ను చంపేయడానికి నేను కొందరికి డబ్బులు ఇచ్చాను, నేను వారికి ఇచ్చిన దాని కంటే ఎక్కువ మొత్తం మీరు నాకు ఇస్తే నేను పై విషయమై ఆలోచిస్తాను.. అని మెయిల్‌లో ఉంది. ఈ విషయమై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications