ఊదారంగులో, నయా ఫీచర్లు: కొత్త రూ.100నోటు చూశారా?
ముంబై: భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) గురువారం కొత్త వందరూపాయల నోటును విడుదల చేసింది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఈ నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది.
ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో గుర్తింపు పొందిన గుజరాత్‌లోని 'రాణి కీ వావ్'ఫొటో నోటు వెనుక భాగంలో ముద్రించారు. కొత్త వందనోటు ఊదా రంగులో ఉంది. ఈ నోటు 66ఎంఎం X 142ఎంఎం ఉంది. ఈ నోటుపై స్వచ్ఛ భారత్ లోగో, ఏ సంవత్సరంలో ముద్రించారు అనే వివరాలు కూడా ఉంటాయి.

కొత్త వంద నోటు పది రూపాయల నోటు కంటే కొద్దిగా పెద్దగా.. పాత వంద నోటు కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. దీవస్‌లోని ముద్రణా కార్యాలయంలో కొత్త వంద నోట్ల ముద్రణ ఇప్పటికే ప్రారంభమైంది.
వీలైనంత త్వరలోనే ఈ కొత్త వంద నోట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ తెలిపింది. ఈ నోటులో కొత్తగా కొన్ని మైక్రో సెక్యూరిటీ ఫీచర్లను చేర్చినట్లు వెల్లడించింది. ఈ ఫీచర్లు అతినీలలోహిత కాంతిలో మాత్రమే కనిపిస్తాయి. కాగా, పాత వంద నోట్లు కూడా చెలమణీలో కొనసాగుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.
-
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు..












Click it and Unblock the Notifications