రూ.2,000 నోట్ల చలామణిపై ఆర్బీఐ కీలక ప్రకటన
Rs 2000 notes: దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణికి బ్రేక్ పడింది. ఇప్పటివరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు ఇక తెరమరుగు కానుంది. ఇకపై ఈ నోట్లేవీ మార్కెట్‌లో చెల్లుబాటు కావు. వీటిపై ఎలాంటి లావాదేవీలను కూడా నిర్వహించలేం. అందుబాటులో ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవడానికి గడువు కూడా ముగిసింది.
గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికే చివరి గడువు విధించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఆ తరువాత దీన్ని అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించింది. 2,000 రూపాయల నోట్లను మార్పిడి చేసుకునే వెసలుబాటు కల్పించిన విషయం తెలిసిందే. 2023-2024 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో- దీనిపై కీలక ప్రకటన వెలువడించింది.

ఇప్పటివరకు 97.92 శాతం మేర పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 3.62 లక్షల కోట్ల వరకు 2,000 నోట్ల రూపాయల నోట్లు చలామణిలో ఉండేవని, అదే ఏడాది మే 19వ తేదీ నాటికి ఈ సంఖ్య 3.56 లక్షల కోట్లకు తగ్గిందని వివరించింది.
గత ఏడాది జూలై 31వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత తగ్గింది. ఆ నెల ప్రారంభంలో 3.14 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మార్కెట్‌లో చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్లు అదే నెల 31వ తేదీ నాటికి 0.42 లక్షల కోట్లకు పడిపోయాయి. మే 19వ తేదీ నుంచి జులై 31వ తేదీ నాటికి 88 శాతం మేర నోట్లు తమ వద్ద జమ అయినట్లు వివరించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల చలామణి సంఖ్య 8,470 కోట్ల రూపాయలకు పడిపోయిందని పేర్కొంది. 8,470 కోట్ల రూపాయల విలువ చేసే 2,000 నోట్లు మార్కెట్‌లో చలామణిలోనే ఉన్నాయని స్పష్టం చేసింది. 29వ తేదీ నాటికి 97.62 శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు పేర్కొంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications