బెంగళూరు మెట్రో, పట్టాలు తప్పిన రీరైలు, ప్రయాణికుల పరిస్థితి ?, ఏం జరిగింది !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ట్రాఫిక్ సమస్య. ట్రాఫిక్ ఇబ్బందులతో బెంగళూరు (Bengaluru) సిటీలోని పలు ప్రాంతాల ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. బెంగళూరు నగర ప్రజలు ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడటానికి పలు ప్రాంతాల్లో మెట్రో రైలు (metro train) సంచారం కొంత రిలీఫ్ ఇస్తోంది.
చాలా సంవత్సరాల నుంచి బెంగళూరులోని (Bengaluru) కొన్ని ప్రాంతాల ప్రజలు మెట్రో రైలులో (metro train) సంచరిస్తు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు. అయితే మెట్రో రైలు ట్రాక్ లో (metro train) రీ రైలు పట్టాలు తప్పడంతో మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మంగళవారం వేకువ జామున రాజాజీనగర మెట్రో రైల్వే (metro train) స్టేషన్ సమీపంలో నమ్మ మెట్రో గ్రీన్ వే మార్గంలో రీ రైలు పట్టాలు తప్పడంతో మెట్రో రైలు సంచారంలో భారీ మార్పులు రావడంతో మెట్రో రైలు ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం ఉద్యోగాలకు చెయ్యడానికి ఆఫీసులకు బయలుదేరిన మెట్రో రైలు (metro train) ప్రయాణికులు (Bengaluru)అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.
తీరా మెట్రో రైల్వేస్టేషన్ కు వెళ్లిన ప్రయాణికుల మెట్రోరైలు (metro train) ప్రయాణంలో భారీ మార్పులు వచ్చాయని తెలుసుకుని బీఎంటీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్ లను ఆశ్రయించారు. మెట్రో రైలు సంచరించే మార్గంలో టెక్నికల్ సమస్యలను గుర్తించడానికి నమ్మ బెంగళూరు (Bengaluru)మెట్రో సిబ్బంది రీ రైలును ఉపమోగించి మెట్రో రైల్వే ట్రాక్ లోని సమస్యలను గుర్తిస్తుంటారు.
సోమవారం రాత్రి మెట్రో రైలు (metro train) సర్వీసులు పూర్తిగా నిలిచిపోయిన తరువాత అర్దరాత్రి రీరైలును మెట్రో రైలు పట్టాల మీదకు తీసుకువచ్చారు. రీరైలు నడుస్తున్న సమయంలో నాగసంద్ర నుంచి సిల్క్ సంస్థ వరకు సంచరిస్తున్న సమయంలో రైలు పట్టాలు తప్పించింది. ఒక్కసారిగా షాక్ కు గురైన అధికారులు పట్టాలు తప్పిన రీరైలును (metro) పట్టాల మీదకు తీసుకురావడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నాగసంద్ర నుంచి యశవంతపురం వరకు, మంత్రిమాల్ (మంత్రి స్వ్కేర్) నుంచి సిల్క్ సంస్థ వరకు మాత్రమే మెట్రో రైలు (metro train) సంచారం ఉంది. అయితే ఒక మార్గంలోనే మెట్రో రైలు సంచరిస్తుండటంతో ప్రతి అర్దగంటకు ఒకసారి మెట్రో రైలు ఆ మార్గంలో సంచరిస్తుండటంతో మెట్రోరైలు ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం (Bengaluru)మద్యాహ్నం తరువాత రీరైలును తప్పించి మెట్రో రైలు సంచారానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని బీఎంఆర్ సీఎల్ (metro train) అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications