నా కొడుకు ఐఏఎస్ అవుతాడు అనుకుంటే ఇలా ?, కాలేజ్ అమ్మాయి హత్య కేసులో ముంతాజ్ !
కర్ణాటకలోని హుబ్బళికి చెందిన నేహా హిరేమఠ్ హత్య కేసుకు సంబంధించి నిందితుడు ఫయాజ్ తల్లి ముంతాజ్ స్పందించారు. నా కొడుకు చేసిన తప్పుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. వందల మంది పిల్లలకు చదువు చెప్పిస్తున్నాను. ఫయాజ్ చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలని ఫయాజ్ తల్లి ముంతాజ్ ధారవాడలో మీడియాకు చెప్పారు.
నా కొడుకు చేసిన తప్పుకు కర్ణాటక ప్రజలకు తాను బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని, నేహా నా కూతురు లాంటిదని, ఆమె తండ్రికి తాను క్షమాపణలు చెబుతున్నానని, చట్ట పరంగా తన కుమారుడికి ఎలాంటి శిక్ష వేసినా నేను అంగీకరిస్తానని హంతకుడు ఫయాజ్ తల్లి ముంతాజ్ అన్నారు, తన కొడుకు ఫయాజ్ ను హత్యకు గురైన నేహా కూడా ప్రేమిస్తుందని తనకు కొంతకాలం క్రితం తెలిసిందని ముంతాజ్ మీడియాకు చెప్పారు.

నేహా నన్ను ప్రేమిస్తోందని తన కుమారుడు ఫయాజ్ తనతో స్వయంగా చెప్పాడని, వారి మతం వేరు, మన మతం వేరు, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించకూడదని తన కుమారుడిని నచ్చచెప్పానని, తరువాత కూడా ఇద్దరు కలిసి తిరిగారని తెలిసిందని ఫయాజ్ తల్లి ముంతాజ్ అంటున్నారు. తన కొడుకును ఐఏఎస్ చేయాలని తాను ఎన్నో కలలు కన్నానని, చివరికి ఇలా జరిగిందని నేహాను అతి దారుణంగా హత్య చేసిన ఫయాజ్ తల్లి ముంతాజ్ తెలిపారు.
కాలేజ్ లో చదువుతున్న నేహా తనను ప్రేమించలేదని ఫయాజ్ రగిలిపోయాడని తెలిసింది. ఇదే విషయంలో నేహా మీద కక్ష పెంచుకున్న ఫయాజ్ ఇటీవల కాలేజ్ క్యాంపస్ ఆవరణంలోనే నేహాను దారుణంగా హత్య చేశాడు, హత్యకు గురైన నేహా తండ్రి హుబ్బళి-ధారవాడ కార్పోరేషన్ కార్పోరేటర్ కావడంతో ఈ హత్య కర్ణాటకలో కలకలం రేపింది. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో హిందూ అమ్మాయిని ముస్లీం యువకుడు హత్య చెయ్యడంతో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications