• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశం కోసం మరో కొడుకును ఆర్మీకి ఇస్తా .. పాకిస్తాన్ పై ప్రతిదాడి చేయాలన్న వీరజవాను తండ్రి

|

పాట్నా : పుల్వామా ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండిస్తోంది. ఈ దాడిని హేయనీయమైన చర్యగా అభివర్ణిస్తున్నాయి. ఉగ్రదాడిలో జవాన్ల వీరమరణంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. వీరుడా .. వందనం అంటూ యావత్ జాతి జవాన్లకు నివాళులర్పిస్తోంది.

దాడిలో నెలకొరిగిన వీరుడు

దాడిలో నెలకొరిగిన వీరుడు

గురువారం మధ్యాహ్నం జరిగిన ఉగ్ర దాడిలో బీహర్ కు చెందిన జవాను రతన్ కుమార్ వీరమరణం పొందాడు. ఇంటికి పెద్దవాడి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. రతన్ ఇకలేరనే విషయాన్ని కుటుంబసభ్యులు, బంధువులే కాదు స్థానికులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

మరో కొడుకును ఇస్తా కానీ ...

మరో కొడుకును ఇస్తా కానీ ...

భారతమాతకు సేవ చేసేందుకు రతన్ కుమార్ ను సైన్యంలో చేర్పించానని ఆయన తండ్రి గద్గత స్వరంతో చెప్పారు. దేశానికి సేవ చేసేందుకు తన మరో కుమారుడిని ఇస్తానని భాగల్ పూర్ లో మీడియాకు చెప్పారు. కానీ పుల్వామా ఉగ్రదాడికి ధీటుగా పాకిస్థాన్ కు జవాబివ్వాలన్నారు. భారతమాతకు సేవలందించేందుకు తన కుమారుడిని త్యాగం చేశానని .. దేశానికి సేవ చేసేందుకు మరో కుమారుడిని కూడా ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. కానీ పాకిస్థాన్ కు మాత్రం సరైన సమాధానం చెప్పాలని స్పష్టంచేశారు.

దాడిలో వీరుల మరణం

దాడిలో వీరుల మరణం

గురువారం మధ్యాహ్నం జమ్ము నుంచి సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ శ్రీనగర్ బయల్దేరింది. దాదాపు 78 వాహనాల్లో 2 వేల 547 మంది జవాన్లు వెళ్తుండగా .. పుల్వామా జిల్లాలో గోరిపుర ప్రాంతంలో గల అవంతిపుర వద్ద ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఓ కారులో ఐఈడీ పేలుడు పదార్థంతో కాన్వాయ్ లోని వాహనాన్ని ఢీ కొనడంతో వాహనం తునాతునకాలై .. జవాన్ల ఎగిరిపడ్డారు. ఆ ప్రాంతమంతా మాంసపు ముద్దలతో .. రక్తంతో భీతావహంగా మారింది. ఈ దాడిలో పదుల సంఖ్యలో జవాన్లు చనిపోయారు. గాయపడ్డ వారికి శ్రీనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

యూపీ వీర జవాన్లకు పరిహారం

యూపీ వీర జవాన్లకు పరిహారం

ఉగ్రదాడిలో మరణించిన వీర జవాన్ల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు అందజేస్తామని తెలిపింది. పుల్వామా ఉగ్రదాడిలో యూపీకీ చెందిన 12 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
the father of one of the slain CRPF jawan Ratan Thakur in Bihar said that he was ready to give up his other son for the service of the country but Pakistan had to be given a befitting reply for the terror act. "I have sacrificed a son in Mother India's service, I will send my other son as well to fight. I am ready to give him up for Mother India, but Pakistan must be given a befitting reply," the father said in Bhagalpur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more