ప్రేమించలేదని మహిళా టెక్కీ హత్య
మహారాష్ట్రలోని పూణే నగరంలో జరిగిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసులో మిస్టరీ వీడింది.
పూణే: మహారాష్ట్రలోని పూణే నగరంలో జరిగిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసులో మిస్టరీ వీడింది. తన ప్రేమను నిరాకరించినందుకు బెంగళూరుకు చెందినా స్నేహితుడే మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంతారాను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
పోలీసుల కథనం ప్రకారం... కోల్ కతాకు చెందిన అంతారా బెంగళూరులో సాఫ్ట్ వేర్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో సహ ఉద్యోగి అయిన సంతోష్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత సంతోష్ కుమార్ ప్రపోజ్ చేయగా అంతారా అతడి ప్రేమను తిరస్కరించింది.

అనంతరం ఆమె పూణే నగరంలోని తల్వాడే ప్రాంతంలో ఉన్న కాప్ జెమిని సంస్థలో చేరింది. అంతారా హత్యానంతరం ఆమె తండ్రి దేబానంద దాస్ అందించిన సమాచారంతో పోలీసులు బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సంతోష్ కుమార్ ను పట్టుకొచ్చి ప్రశ్నించారు.
పోలీసుల విచారణలో సంతోష్ కుమార్ నిజం అంగీకరించాడు. తాను అంతారాను ప్రేమించినట్లు, తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందన్న కోపంతోనే ఆమెను కత్తితో పొడిచి చంపినట్లు చెప్పాడు. దీంతో సంతోష్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు పూణే అదనపు ఎస్పీ రాజ్ కుమార్ షిండే చెప్పారు.












Click it and Unblock the Notifications