ప్రభుత్వ కార్యాలయాల్లో సీనియర్ అధికారి కుర్చీపై తెల్ల టవల్ ? కారణం అదే..?
భారత ప్రభుత్వ కార్యాలయాల్లో సీనియర్ అధికారి కుర్చీలపై తెల్ల టవల్ కనిపించడం సర్వసాధారణం. ఇది కేవలం ఓ అలవాటు మాత్రమే కాకుండా శుభ్రతకు మించి అధికారం, హోదాకు ప్రతీకగా మారింది. సీనియర్ అధికారులు కూర్చునే కుర్చీలపై చక్కగా మడిచి ఉంచిన తెల్లని టవల్ ఉంటుంది. దీని వెనుక ఓ ఆసక్తికరమైన చరిత్ర, కొన్ని కారణాలున్నాయని చెబుతున్నారు.
అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై టవల్స్ ఉంచే పద్ధతికి వలసవాద కాలం నాటి మూలాలు ఉన్నాయని అంటుంటారు. ఆ రోజుల్లో దౌత్యవేత్తలు గుర్రాలపై పర్యటించేవారని.. ప్రయాణ అలసట, పరిశుభ్రత కోసం చెమట తుడుచుకోవడానికి ఈ టవల్స్‌ను ఉపయోగించేవారని స్పష్టం చేస్తున్నారు. అధిక చెమట వల్ల కుర్చీలపై మరకలు పడకుండా తెల్లని టవల్స్ వేసేవారని వివరిస్తున్నారు.

ఇక ఆధునిక కాలంలోనూ ఈ ఆచారం కొనసాగడానికి కొన్ని కారణాలున్నాయి. శుభ్రత, సౌకర్యం ఒకటైతే, ఇంకా ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎయర్ కండిషనింగ్ సౌకర్యాలు లేవంటున్నారు. తోలు లేదా వినైల్ కుర్చీలు ఎక్కువగా చెమటను పీల్చుకుంటాయి, కాబట్టి టవల్ చెమటను గ్రహించి, కుర్చీని శుభ్రంగా ఉంచుతుంది. కుర్చీని మార్చడం కంటే టవల్‌ను ఉతకడం సులభమని ఇకపోతే, ఇది అధికారం, హోదాకు ప్రతీకగా మారిందని తెలియజేస్తున్నారు.
కాగా ఉన్నత స్థాయి అధికారుల కుర్చీలపై మాత్రమే తెల్ల టవల్స్ ఉంటాయి. మిగతా వారి కుర్చీలపై ఉండకపోవడం లేదా భిన్నంగా ఉండటం ఈ శ్రేణిని స్పష్టంగా సూచిస్తుంది. ఒక గదిలో అనేక కుర్చీలు ఉన్నప్పటికీ, తెల్ల టవల్ చూసి అధికారిని సులభంగా గుర్తించవచ్చు. ప్రారంభంలో పరిశుభ్రత, సౌకర్యం కోసం మొదలైన ఈ ఆచారం, కాలం మారినప్పటికీ, భారతీయ బ్యూరోక్రసీలోని సాంప్రదాయాలు, హోదా పట్ల గౌరవాన్ని, పాత అలవాట్లను ప్రతిబింబిస్తూ వస్తోంది.












Click it and Unblock the Notifications