Rebel: ఊపుకుంటూ వెళ్లిపోయిన సంకీర్ణ ప్రభుత్వం, సీఎం, గవర్నర్ భేటీకి ఏక్ నాథ్ షిండే సిద్దం, ఎమ్మెల్యేలు !
ముంబాయి/గుహవాటి: శివసేన పార్టీ రెబల్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే దెబ్బకు మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఇంటికి వెళ్లడానికి సిద్దం అయ్యింది. ఏక్ నాథ్ షిండే ఏ ముహూర్తాని తిరుగుబాటు చేశాడో కాని శివసేనతో పాటు మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వానికి కోలుకోలేని దెబ్బ పడింది. శివసేనకు చెందిన సీఎం, ఎన్సీపీకి చెందిన హోమ్ మంత్రితో పాటు మహారాష్ట్ర ఇంటిలిజెన్స్ నిర్లక్షం కారణంగా ఆ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం పని అయిపోయింది. రెబల్ ఎమ్మెల్యేలతో చర్చించిన తరువాత ఏక్ నాథ్ షిండే ఈరోజు (గురువారం) మహారాష్ట్ర గవర్నర్ ను కలిసి తనకు మద్దతు ఇష్తున్న ఎమ్మెల్యేల వివరాలు, ఎందుకు తిరుగుబాటు చెయ్యాల్సి వచ్చిందో అనే విషయంపై చర్చించడానికి సిద్దం అవుతున్నారని ఆయనకు సన్నిహితుడైన ఓ నాయకుడు అంటున్నారు.

ఎన్ని చేసినా ఏమి లాభం ?
శివసేన పార్టీ రెబల్ నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే దెబ్బకు మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఇంటికి వెళ్లడానికి సిద్దం అయ్యింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే రాజీనామాతో మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. గురువారం అసెంబ్లీలో ఎదురైయ్యే పరిస్థితి ఊహించి ముందుగానే పరువు కాపాడుకోవడానికి సీఎం ఉద్దవ్ ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారని శివసేన నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు.

అన్ని ప్రయత్నాలు విఫలం
రెబల్ ఎమ్మెల్యేలను ముంబాయి పిలిపించుకోవడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఆయన మద్దతుదారులు అనేక ప్రయత్నాలు చేశారు. గవర్నర్, సుప్రీం కోర్టు ఆదేశాలతో ఉద్దవ్ ఠాక్రేకి వేరే మార్గం లేక ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారని, అసెంబ్లీలో పరువు పోకముందే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయనకు సన్నిహితంగా ఉంటున్న ఓ నాయకుడు మరాఠీ మీడియాతో అన్నారు.

ఏక్ నాథ్ దెబ్బతో ఎటుకాకుండా పోయిన సీఎం
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 288, కొన్ని రోజుల క్రితం వరకు మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వానికి 152 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండేది. ఇటీవల శివసేన ఎమ్మెల్యే మరణించడంతో శాసన సభ్యుల సంఖ్య 287గా ఉంది. అసెంబ్లీలో 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఉంటుంది. ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి వందకు వంద శాతం రివర్స్ అయ్యింది.

గవర్నర్ ముందుకు ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారు !
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే రాజీనామాతో మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ నాథ్ షిండే ఆయన మద్దతుదారులతో చర్చించిన తరువాత నేరుగా ముంబాయి చేరుకుని మహారాష్ట్ర గవర్నర్ ను కలవడానికి సిద్దం అవుతున్నారని సమాచారం.

ముంబాయికి ప్రత్యేక విమానం సిద్దం
మహారాష్ట్ర గవర్నర్ ను కలిసి తనకు మద్దతు ఇష్తున్న ఎమ్మెల్యేల వివరాలు, ఎందుకు తిరుగుబాటు చెయ్యాల్సి వచ్చిందో అనే విషయంపై చర్చించడానికి సిద్దం అవుతున్నారని ఆయనకు సన్నిహితుడైన ఓ నాయకుడు అంటున్నారు. ఏక్ నాథ్ షిండే ముంబాయి చేరుకోవడానికి ప్రత్యేక విమానం సిద్దం చేసుకున్నారని సమాచారం.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications