వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ కేసుల రికార్డ్: వరుసగా రెండోరోజు 3లక్షలకు పైగా కొత్త కేసులు.. మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కోవిడ్

భారత్‌లో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.

వరుసగా రెండోరోజు 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,32,730 కొత్త కేసులు వచ్చాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

2,263 మంది కరోనాతో చనిపోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 1,86,920కి చేరింది.

1,93,279 మంది డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 24,28,616 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మొత్తం 13,54,78,420 మందికి వ్యాక్సీన్ వేశారు.

https://twitter.com/ANI/status/1385446613351505922

కేటీఆర్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణ మంత్రి కేటీఆర్‌‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.

ఆయన స్వయంగా ఈ విషయాన్ని ట్విటర్‌లో తెలిపారు.

తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నానని ఆయన చెప్పారు.

గడిచిన కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

https://twitter.com/KTRTRS/status/1385439391972089859

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Record Covid cases: Over 3 lakh new cases for the second day in a row, Misniter KTR tests positive for Covid
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X