Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Target: మోదీ తరువాత నెంబర్ టూ పదవి , ధైర్యంగా టార్టెట్ చేసిన గాలి జనార్దన్ రెడ్డి, ఏమిచ్చారు ?

బెంగళూరు/బళ్లారి/హైదరాబాద్: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి పేరు పెద్దగా పరిచయం చెయ్యనవసరం లేదు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో గాలి జనార్దన్ రెడ్డికి ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు అనచరులు ఉన్నారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ తరువాత అంతటి పదవిలో ఉన్న రెండో వ్యక్తిని టార్గెట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కేంద్రంలో, కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాకు ఏం న్యాయం చేసింది ? అని ప్రశ్నించారు. కూరలో కరివేపాకులా తనను వాడుకుని వదిలేశారని గాలి జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ తరువాత కేంద్రంలో సెకండ్ వన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఆయన్ను టార్గెట్ చేసి మాట్లాడటం హాట్ టాపిక్ అయ్యింది.

గాలికి ఫ్యాన్స్ ఎక్కువ

గాలికి ఫ్యాన్స్ ఎక్కువ

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో గాలి జనార్దన్ రెడ్డికి ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు అనచరులు ఉన్నారు. కర్ణాటకలో రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ లో బంధువులు, తెలంగాణ అల్లుడు, తమిళనాడులో స్నేహితులు ఇలా గాలి జనార్దన్ రెడ్డి అన్ని వైపులా బలగం పెంచుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా వంద మంది ఆయన్ను కలుస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి నాలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

గాలి దెబ్బకు షాక్

గాలి దెబ్బకు షాక్

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన రెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మాజీ మంత్రి జానారెడ్డి బెంగళూరులోని ఆయన నివాసం పారిజాతలో హాట్ కామెట్స్ చేశారు. తాను పనిచేసిన బీజేపీ నుంచి తనకు గుర్తింపు రాలేదని, అందుకే కర్ణాటక కల్యాణ ప్రగతి పార్టీని స్థాపించి ముందడుగు వేస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మిగిలి ఉండగానే కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక కల్యా ప్రగతి అనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఇప్పటికే కొప్పళ జిల్లాలోని గంగావతిలో నివాసం ఉంటున్న గాలి జనార్దన్ రెడ్డి వచ్చే శాసన సభ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని వెలుగు చూసింది. బళ్లారి కింగ్ గా ఓ వెలుగు వెలిగిన గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం బళ్లారిలో పోటీ చేసే అవాశం లేకుండా పోయింది.

అందర్ని గుర్తు చేసుకున్న రెడ్డి

అందర్ని గుర్తు చేసుకున్న రెడ్డి

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, బీజేపీ సీనియర్ జగదీష్ షెట్టర్, బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, దివంగత సుష్మా స్వరాజ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, ఆయన సన్నిహితులను గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు.కాలమే కైలాసం అని నమ్మిన వాడిని. బసవన్న చెప్పినట్టు కుల, మత, వర్ణ భేదాలు లేకుండా పనిచేయాలని నిర్ణయించుకున్నానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

బీజేపీ నాకు ఏమిచ్చింది ?

బీజేపీ నాకు ఏమిచ్చింది ?

నేను పనిచేసిన పార్టీ (బీజేపీ) నుంచి ఎలాంటి హోదా, గుర్తింపు రాకపోవడంతో ఈరోజు వాజ్‌పేయిని స్మరించుకుంటూ ప్రజా జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నాను. కర్ణాటక కళ్యాణ ప్రగతి పార్టీని స్థాపించి రాజకీయంగా తదుపరి అడుగు వేస్తున్నాని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బి. శ్రీరాములు తరపున ప్రచారం చేశానని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. తనను చిత్రదుర్గ జిల్లాలోని మొలకాల్మూరు అసెంబ్లీ నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా ఉండేలా చేసి ఉంటే బీజేపీ 130 సీట్లకు పైగా గెలిచి ఉండేదని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు.

అమిత్ షాను టార్గెట్ చేసిన రెడ్డి ?

అమిత్ షాను టార్గెట్ చేసిన రెడ్డి ?

కర్ణాటకలో గత శాసన సభ ఎన్నికల ఫలితాలపై గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడారు. గత శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి 104 సీట్లు వచ్చాయి, అప్పుడు కూడా అమిత్ షాను సంప్రదించాలని నేను అనేక ప్రయత్నాలు చేశాను, కానీ కుదరలేదు, గాలి జనార్దన్ రెడ్డిని బీజేపీ సరిగ్గా ఉపయోగించుకోలేదని అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి, కాని నేను ఆ విషయాన్ని లైట్ గా తీసుకున్నాను, 2018లో నా సొంత నిర్ణయం నేను తీసుకోలేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాను గుర్తు చేసుకున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాల్లోకి రాకూడదని తాను నిర్ణయించుకున్నానని, బెంగుళూరు వచ్చిన అమిత్ షా జనార్దన్ రెడ్డికి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదంటూ ప్రకటన చేశారని, ఈ విషయాన్ని నేను, నా భార్య మీడియాలో చూసి ఆవేదన చెందామని గాలి జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అమిత్ షా ఏం చెప్పారు ?, ఇప్పుడు ఏం చేశారు

అమిత్ షా ఏం చెప్పారు ?, ఇప్పుడు ఏం చేశారు

రెండు రోజుల తర్వాత ఢిల్లీలో అమిత్‌ షాను కలవడానికి నా స్నేహితుడు శ్రీరాములు ఫోన్‌ చేశారు. శ్రీరాములు మొలకల్మూరులో పోటీ చేస్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్లి సహాయం చెయ్యి, ఎన్నికలు పూర్తి అయిన తరువాత నీకు మంచి హోదా ఇస్తామని అమిత్ షా స్వయంగా హామీ ఇచ్చారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. అందుకే శ్రీరాములును గెలిపించాలని చురుకుగా ప్రచారంలో పాల్గొన్నానని గాలి జనార్దన్ రెడ్డి వివరించారు.

అక్రమ మైనింగ్ చెయ్యలేదు

అక్రమ మైనింగ్ చెయ్యలేదు

అక్రమ మైనింగ్ కేసు, జైలుకు వెళ్లడంపై గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ నేను అక్రమ మైనింగ్ చేయలేదు, లీగల్ గా మైనింగ్ చేశాను.. కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి, నేను నిర్దోషిగా బయటకు వస్తాను, నా శ్రేయస్సును తట్టుకోలేని రాజకీయ ప్రత్యర్థులు నామీద అక్రమ మైనింగ్ కేసులు, నా పరిశ్రమల గురించి తప్పుడు ప్రచారం చేసి నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. సుష్మా స్వరాజ్‌కు సహాయం చేసినందుకు నన్ను అరెస్టు చేశారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

అందరూ మోసం చేశారు

అందరూ మోసం చేశారు

రాష్ట్ర రాజకీయాల్లో నాది అన్న చాలా మందిని మరిచిపోయాను, మోసపోయాను. నేను బాగున్నప్పుడు అందరూ మెచ్చుకున్నారు. కానీ కష్టసమయాల్లో మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, జగదీష్ షెట్టర్ తప్ప ఎవరూ వచ్చి నాకు ధైర్యం చెప్పలేదని జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రకు వరుణలో టిక్కెట్ ఇచ్చి ఉంటే 2018 ఎన్నికల్లో బీజేపీకి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవని, వరుణ నియోజకవర్గంలో విజయేంద్రకు టిక్కెట్ ఇస్తారనే నమ్మకంతో ఆయన పనిచేశారని, నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు సిద్ధమయ్యారని, అయినా బీజేపీ హైకమాండ్ మోసం చేసిందని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+