బంపర్ ఆఫర్: రెడ్‌మీ 5ఏ ఫోన్‌పై రూ.వెయ్యి తగ్గింపు, మరో వెయ్యి జియో క్యాష్ బ్యాక్

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఉచిత ఆఫర్లతో పాటు కష్టమర్లను ఆకర్షించేందుకు టెలికం కంపెనీలు, మొబైల్ కంపెనీలు అనేక ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. చైనాకు చెందిన షియోమీ కంపెనీ తన రెడ్‌మీ 5 ఏ మొబైల్‌పై రూ.వెయ్యి రూపాయాలను తగ్గింపుకు అందించనున్నట్టు ప్రకటించింది. అయితే తన తొలి 50 లక్షల మంది కష్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ను వర్తింప చేస్తామని ప్రకటించింది.

రిలయన్స్ జియో మార్కెట్లోకి రంగ ప్రవేశంతో టెలికం కంపెనీలు తమ కష్టమర్లను ఆకట్టుకొనేందుకు కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. మరో వైపు ఫీచర్ ఫోన్‌తో జియో రంగంలోకి దిగింది.

జియో బాటలోనే ఎయిర్‌టెల్, ఐడియా, వోడాఫోన్‌ కూడ ఇదే తరహ ఫోన్లను కూడ మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం మొబైల్‌ ఫోన్ల కంపెనీలు కూడ టెలికం కంపెనీల తరహలోనే పోటీలు పడుతున్నాయి.

రెడ్ మీ 5 ఏ ధర రూ.1000 తగ్గింపు

రెడ్ మీ 5 ఏ ధర రూ.1000 తగ్గింపు

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ షియోమీ రెడ్‌మీ 5ఏ మొబైల్‌‌పై వెయ్యి రూపాయాలను తగ్గింపును ప్రకటించింది. ఈ ఫోన్‌ను నవంబర్30వ,తేదినే మార్కెట్లోకి షియోమీ విడుదల చేసింది. అయితే తగ్గింపు ధర తొలి 50 లక్షల మందికే వర్తింపజేస్తామని షియోమీ కంపెనీ ప్రకటించింది.వాస్తవానికి ఈ ఫోన్ ధర రూ.5999. అయితే వెయ్యి రూపాయాలు తగ్గిస్తే ఈ పోన్ రూ.4,999లకు లభ్యం కానుంది.

 జియో సిమ్ వినియోగిస్తే మరో రూ.1000 తగ్గింపు

జియో సిమ్ వినియోగిస్తే మరో రూ.1000 తగ్గింపు

షియోమీ కంపెనీతో జియో ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఒప్పందం మేరకు రెడ్ మీ 5 ఏ ఫోన్‌పై జియో కూడ రూ.1000 తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. రెడ్‌మీ 5 ఏ ఫోన్‌లో జియో సిమ్ కార్డు ఉపయోగిస్తే వెయ్యి రూపాయాల క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను వర్తింపజేయనుంది జియో. అయితే జియో ఉపయోగించడం ద్వారా ఈ ఆఫర్‌ను వర్తింపచేయనున్నట్టు జియో ప్రకటించింది.

 జియో ఆఫర్ ఇలా పొందాలి

జియో ఆఫర్ ఇలా పొందాలి

రెడ్‌మీ 5ఏ ఫోన్‌లో జియో సిమ్ కార్డు ఉపయోగిస్తే రూ.199 ప్యాక్‌తో ప్రతి నెలా రీఛార్జి చేసుకోవడం ద్వారా రూ.1000 క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు.ఈ ప్యాక్‌పై 1జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ 28 రోజుల పాటు లభిస్తాయి. అయితే, తొలి రీఛార్జిని 2017 డిసెంబర్‌ 5 నుంచి 2018 నవంబర్‌ 30 లోగా చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం రూ.100 చొప్పున 10 వోచర్లు వినియోగదారుని ఖాతాలో జమ అవుతాయి.

 2019 నవంబర్ వరకు చెల్లుబాటు

2019 నవంబర్ వరకు చెల్లుబాటు

జియో వోచర్లను రూ.309తో గానీ, అంతకంటే ఎక్కువ మొత్తం రీఛార్జి చేసినప్పుడు వినియోగించుకోవచ్చు. లేదా రూ.201, అంతకంటే ఎక్కువ మొత్తం విలువ కలిగిన యాడ్‌-ఆన్‌ ప్యాక్స్‌ రీఛార్జి కోసం వినియోగించుకోవచ్చు. 2019 నవంబర్‌ 30 వరకు ఈ వోచర్లు చెల్లుబాటు అవుతాయి.ఈ ఫోన్‌ ఈ నెల 7 నుంచి ఫ్లిప్‌కార్ట్‌‌లో బుక్ చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+