సల్మాన్ ఖాన్ కోసం ముంబయిలో రెక్కీ
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ కోసం ముంబయిలో రెక్కీ జరిగింది. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు పాల్పడిన నిందితులే ఈ రెక్కీ నిర్వహించారు. సల్మాన్ ఖాన్ లక్ష్యంగా ఇది జరిగిందని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సూచనల ప్రకారమే ఈ రెక్కీ జరిగినట్లు తెలిపారు.
మూసేవాలా హతమైన తర్వాత సల్మాన్ ఖాన్‌ను, ఆయన తండ్రిని ఇదే రీతిలో చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఓ లేఖను వదిలి వెళ్లారు. ఈ లేఖతో సల్మాన్ ముంబయి కమిషనర్‌ను కలవగా వారు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సల్మాన్‌కు గన్ లైసెన్స్, ప్రత్యేక భద్రత కల్పించారు. మూసేవాలా హత్యకేసులో అరెస్టయిన కపిల్ పండిట్‌ను విచారించగా మరో ఇద్దరితో కలిసి రెక్కీ నిర్వహించామని, ఇది బిష్ణోయ్ సూచనల మేరకే జరిగిందని తెలిపినట్లు చెప్పారు. ఆ ఇద్దరిని కూడా విచారిస్తామని డీజీపీ తెలిపారు.

సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసేందుకు సంపత్ నెహ్రాతో కలిసి ప్రణాళిక అల్లారని గౌరవ్ యాదవ్ చెప్పారు. మూసేవాలా కేసులో ఇప్పటి వరకు 23 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 35 మం దినిందితులను గుర్తించామని, వారిలో ఇద్దరు ఎన్‌కౌంటర్‌తలో హతమయ్యారని వెల్లడించారు. మూసేవాలాపై కాల్పులకు పాల్పడిన ఆరుగురు ప్రధాన నిందితుల్లో ఒక వ్యక్తి పరారీలో ఉన్నారు. అతన్నికూడా పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోగా ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేశారు. బెంగాల్- నేపాల్ సరిహద్దులో వీరినిపట్టుకున్నట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications