గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే రోజు అర్దరాత్రి బాయ్ ఫ్రెండ్స్ ను నరికి చంపేశారు!

చెన్నై/కోయంబత్తూరు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రియురాలి బర్త్ డే అని ఆమె ప్రియుడు స్నేహితులకు రాత్రి లిక్కర్ పార్టీ ఇచ్చాడు. ఫ్రెండ్స్ తో కలిసి ప్రియుడు పీకలదాక మద్యం సేవించాడు. అర్ధరాత్రి ప్రియురాలి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లిన ప్రియుడిని యువతి బంధువులు కొడవలితో దాడి చేయడంతో అతను మృతి చెందాడు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని సుందరాపురం ప్రాంతంలో ప్రశాంత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కోయంబత్తూరు సమీపంలోని చెట్టిపాళయం ప్రాంతంలో నివాసం ఉంటున్న 18 ఏళ్ల యువతితో ప్రశాంత్ ప్రేమలో పడ్డాడు. యువతి కూడా ప్రశాంత్ ను ప్రేమిస్తున్నది. యువతి, యువకుడి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో ఏడాది తర్వాత పెళ్లి చేద్దామని ఇరువైపుల కుటుంబ సభ్యులు మాట్లాడుకుని ప్రేమికులకు ఇప్పటికే హామీ ఇచ్చారు.

 girlfriend who hacked her boyfriend

ఆదివారం ప్రియురాలి పుట్టిన రోజు. తన ప్రియురాలి పుట్టిన రోజు సందర్బంగా మీకు మందు పార్టీ ఇస్తానని ప్రశాంత్ ముందుగానే అతని స్నేహితులకు చెప్పాడు. ఆదివారం రాత్రి ప్రశాంత్ అతని స్నేహితులు పీకలదాక మద్యం సేవించారు. తువాత స్నేహితులు గుణశేఖరన్, అభిషేక్‌లతో కలిసి ప్రశాంత్ అతని ప్రియురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు మద్యం మత్తులో బయలుదేరాడు.

అర్దరాత్రి 12 గంటల సమయంలో ప్రశాంత్ అతని ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. కాంపౌండ్ వాల్ ఎక్కి లోపలికి వెళ్లిన ప్రశాంత్ ఇంటి తలుపు తట్టారు. శబ్ధం విని ప్రియురాలి తండ్రి, మేనమామ విఘ్నేష్‌ రావడంతో మద్యం మత్తులో ఉన్న ప్రశాంత్‌ తాను వెంటనే తన ప్రియురాలిని చూడాని, ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలని మద్యం మత్తులో నానా హంగామా చేసి అందరికి వినపడేలా అరిచాడు.

నువ్వు రేపు వచ్చి అమ్మాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలని, ఇంతరాత్రి పూట హంగామా చెయ్యకూడదని ఆమె కుటుంబ సభ్యులు ప్రశాంత్ కు చెప్పారు. ఇదే సమయంలో ప్రియురాలు కూడా నిద్రలేచి ఇంటి బయటకు వచ్చింది. తరువాత ప్రియురాలి మేనమామ విఘ్నేష్‌, ప్రశాంత్ లమధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో విఘ్పేష్ సహనం కోల్పోయి ఇంట్లో ఉన్న కొడవలి తీసుకుని వచ్చి మద్యం మత్తులో హంగామా చేస్తున్న ప్రియుడు ప్రశాంత్ మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు.

 girlfriend who hacked her boyfriend

స్నేహితులు ప్రశాంత్‌ను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి బయలుదేరారు. మెడ, నెత్తిపై నుంచి రక్తం కారుతోంది. కానీ మార్గమధ్యంలో ప్రశాంత్ ను తీసుకెలుతున్న బైక్ లో పెట్రోల్ ఖాళీ అయిపోయించింది. ద్విచక్ర వాహనం ఆపిన ప్రశాంత్ స్నేహితులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

అనంతరం 108 అంబులెన్స్‌లో ప్రశాంత్‌ను కోయంబత్తూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందాడని చెప్పారు. ప్రశాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు. ప్రశాంత్ హత్య కేసులో ప్రియురాలు మేనమామ విఘ్నేష్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+