అదిరిపోయిన రిలయన్స్ జియో డేటా ప్లాన్స్
రిలయన్స్ జియో తన ఎయిర్ ఫైబర్ వినియోగదారుల కోసం మరో రెండు కొత్త ప్లాన్స్‌ను ప్రకటించింది. కాకపోతే ఇవి రెగ్యులర్ ప్లాన్స్ కావు. అదనపు డేటా వినియోగించుకునేవారి కోసం తీసుకువచ్చిన డేటా బూస్టర్ ప్లాన్స్. వీటి ధరలు రూ.251, రూ.101గా ఉన్నాయి. డేటా బూస్టర్ కోసం రిలయన్స్ జియో గతంలో రూ.401 ప్లాన్ ప్రకటించింది.
దీపావళి నుంచి దేశవ్యాప్తంగా జియో ఎయిర్‌ఫైబర్ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా దాదాపు 500 పట్టణాల్లో ఈ సేవలు లభిస్తున్నాయి. ఎయిర్ ఫైబర్ లో వైర్ అవసరం ఉండదు. 5జి ఆధారిత నెట్ వస్తుంది. రెగ్యులర్, మ్యాక్స్ పేరుతో మొత్తం ఆరు ప్లాన్స్ అందిస్తోంది. వీటిల్లో గరిష్టంగా 1 టీబీ డేటా వస్తుంది. డేటా పూర్తవగానే వేగం 64 కేబీపీఎస్ కు పడిపోతుంది. ఇటువంటి సందర్భాల్లోనే డేటా బూస్టర్ ప్యాక్స్ వినియోగదారుడికి అవసరమవుతాయి.

రూ.101 ప్లాన్‌లో 100 జీబీ డేటా వస్తుంది. రూ.251 ప్లాన్ లో 500 జీబీ డేటా వస్తుంది. వీటికి ప్రత్యేకంగా గడువంటూ ఉండవు. అప్పటి వరకు ఫోన్ లో ఉండే బేస్ ప్లాన్ గడువే వీటికి వర్తించనుంది. ఈ తరహాలోనే జియో గతంలో రూ.401తో డేటా బూస్టర్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ కింద 1టీబీ డేటా ఉంటుంది. డేటా బూస్టర్ ప్లాన్లకు జీఎస్టీ అదనంగా వసూలు చేస్తారు. రెగ్యులర్ ప్లాన్ల విషయానికొస్తే రూ.599, రూ.899, రూ.1,199 ధరల్లో ఎయిర్ ఫైబర్ ప్లాన్లను కంపెనీ అందిస్తోంది. రూ.1,499, రూ.2,499, రూ.3,999 పేరిట ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
జియో ఎయిర్‌ఫైబర్ అనేది ప్లగ్ అండ్ ప్లే విధానంలో లభిస్తుంది. వినియోగదారులు ప్లగ్ ఇన్ చేస్తే చాలు ఈ సర్వీసును సులభంగా వాడుకోవచ్చు. అదే ఫైబర్‌కు అయితే నిర్దిష్టమైన ఇన్‌స్టలేషన్ అవసరపడుతుంది. అప్పుడే వారు నెట్ ను వినియోగించగలుగుతారు.












Click it and Unblock the Notifications