గుడ్‌న్యూస్‌! జియో రిపబ్లిక్ డే ఆఫర్: 50 శాతం అదనపు డేటా..

రిలయన్స్ జియో నుంచి మరో శుభవార్త! రిపబ్లిక్ డే ఆఫర్ కింద తన వినియోగదారులకు 50 శాతం అదనపు డేటాను ప్రకటించింది. సవరించిన ప్యాన్లు ఈ నెల 26 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

ముంబై: రిలయన్స్ జియో నుంచి మరో శుభవార్త! రిపబ్లిక్ డే ఆఫర్ కింద తన వినియోగదారులకు 50 శాతం అదనపు డేటాను ప్రకటించింది. ఈ నెల మొదట్లో హ్యాపీ న్యూఇయర్‌ 2018 ఆఫర్‌ కింద కొన్ని ప్లాన్లను సవరించింది జియో.

ఇప్పుడు రిపబ్లిక్‌ డే సందర్భంగా మరోసారి ప్లాన్లను సవరించింది. రూ.149, ఆ పైబడిన 1జీబీ డేటా ప్యాక్‌లపై ఇకమీదట 1.5జీబీ, 1.5జీబీ డేటా ప్యాక్‌లపై 2జీబీ డేటా అందించనుంది. జనవరి 26 నుంచి ఈ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి.

reliance-jio

జియో ప్రస్తుతం రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్లాన్లపై 28 రోజులు, 70 రోజులు, 84 రోజులు, 91 రోజుల కాలపరిమితిపై రోజుకు 1జీబీ డేటా అందిస్తోంది. దీంతో పాటు అపరిమిత కాల్స్ లభిస్తున్నాయి.

జనవరి 26 తర్వాత ఆయా ప్యాక్‌లపై 1.5జీబీ డేటా అందించనుంది. 1.5 జీబీ డేటా ప్లాన్లు అయిన రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్లాన్లపై 2జీబీ డేటా లభించనుంది.

దీంతో పాటు రూ.98 ప్లాన్‌ను కూడా జియో సవరించింది. రిపబ్లిక్‌డే ఆఫర్‌ కింద ఇకపై ఈ ప్లాన్‌పై 28రోజుల కాలపరిమితిపై 2జీబీ డేటాను జియో అందిస్తోంది. ఇప్పటి వరకు 14 రోజుల కాలపరిమితిపై 150 ఎంబీ డేటా మాత్రమే ఈ ప్లాన్‌ కింద లభిస్తోంది.

సవరించిన ప్యాన్లు ఈ నెల 26 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే వేరే ప్లాన్‌తో రీఛార్జి చేసుకున్నవారికి ఆ కాలపరిమితి పూర్తయిన తర్వాత ఈ కొత్త ఆఫర్‌ వర్తించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+