‘రోజా’లో అక్కడ ముస్లింలతోపాటు హిందువులు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాలో మతసామరస్యం వెల్లువిరుస్తోంది. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి కొందరు హిందువులు కూడా రోజా(ఉపవాసం) పాటించడానికి సిద్ధమవుతున్నారు.
తమ మహోబాలోని ఉదల్ చౌక్ ప్రాంతంలో శుక్రవారం నుంచి 60 మంది ఓ బృందంగా ఉపవాసానికి కూర్చుంటామని, ఈ 60మందిలో 25మంది హిందువులు కూడా ఉన్నారని బుందేలి సమాజ్ కో ఆర్డినేటర్ తారా పట్కార్ తెలిపారు.
తామంతా ఉదయం, సాయంత్రం ప్రార్థనల్లో కూడా పాల్గొంటారని చెప్పారు. తమ ప్రాంతంలో మతసామరస్యం పెంపొందించడానికి తాము ఇలా చేస్తున్నామని తెలిపారు. అలాగే తమ ప్రాంతంలో ఎయిమ్స్ ఏర్పాటుకు ఈ ఉపవాస దీక్షలు సహకరిస్తాయని చెప్పారు.

నేతలు తమ ఏకత్వాన్ని గుర్తించి ఎయిమ్స్ ఏర్పాటుకు సుముఖంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. బుందేల్‌ఖండ్‌కు కేంద్రంగా ఉన్న జిల్లాలో సరైన వైద్య సేవలు అందుబాటులో లేవని చెప్పారు.
మెరుగైన వైద్యం కోసం కాన్పూర్, లక్నో, ఆగ్రా లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిమ్స్ కోసం ప్రధానికి కూడా లేఖ రాశామని చెప్పారు.












Click it and Unblock the Notifications