గుడ్ న్యూస్: వీసా జారీలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం, ఇకపై పోలీస్ క్లియరెన్స్ అక్కర్లేదు
క్లియరెన్స్ సర్టిఫికెట్ అవసరం లేదు. దీని వల్ల సమయం పట్టడం, ఇతర సమస్యల వల్ల సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా, భారతదేశం మధ్య వ్యుహాత్మక భాగస్వామ్యం, సంబంధాల బలోపేతం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వీసా తీసుకునేందుకు పోలీస్ క్లియరెన్స్ తొలగించామని దేశంలో గల సౌదీ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
దీంతో అప్లికేషన్ ప్రాసెసింగ్ త్వరగా అవుతుంది. పర్యాటకులకు తక్కువ డాక్యుమెంటేషన్ అవుతుంది. టూర్ సంస్థలకు కూడా మేలు జరుగుతుంది. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ నిర్ణయం దోహద పడుతుందని పేర్కొంది. ఇప్పటికే సౌదీలో 20 లక్షల మంది భారతీయులు ప్రశాంతంగా ఉన్నారని వివరించారు.

సౌదీ యువరాజు, ప్రధాని మహ్మద్ బిన్ సల్మాన్ ఈ నెలలో భారత్ రావాల్సి ఉంది. ప్రధాని మోడీతో మీట్ కావాల్సి ఉంది.. అయితే షెడ్యూల్‌లో సమస్య వల్ల పర్యటన రద్దు అయ్యింది. ఇండోనేషియాలో గల బాలిలో జరిగే జీ 20 శిఖరాగ్ర సమావేశానికి మాత్రం హాజరవుతున్నారు.
దేశం నుంచి సౌదీ అరేబియాకు ఎక్కువగా కార్మికులు వెళుతుంటారు. వారు వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ విధానం కొత్తగా వెళ్లేవారికి యూజ్ కానుంది. వారికి వీసా ప్రాసెస్ చాలా తొందరగా అవనుంది. దీంతోపాటు పర్యాటక సంస్థలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కస్టమర్లను వేగంగా సౌదీకి పంపించే వీలు ఉంది.












Click it and Unblock the Notifications