వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్ధవ్ పట్టు: యోగి చేసింది ఫడ్నవీస్ చేయలేరా...

ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతుదారుగా కీలక అంశాలపై అనునిత్యం విమర్శలు చేస్తున్న ఉద్ధవ్ థాకరే.. అదే రుణ మాఫీ పథకం మహారాష్ట్రలోనూ అమలు చేయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను డిమాండ్ చేశారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

లక్నో/ ముంబై: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం తొలి సమావేశంలోనే 2.5 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ది చేకూర్చే నిర్ణయం తీసుకున్నది. వ్యవసాయం సాగు కోసం బ్యాంకుల్లో తీసుకున్న రూ.లక్ష వరకు రుణాలను రమారమీ రూ.36 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ మిత్ర పక్షం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే అభినందించారు.

కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతుదారుగా కీలక అంశాలపై అనునిత్యం విమర్శలు చేస్తున్న ఉద్ధవ్ థాకరే.. అదే రుణ మాఫీ పథకం మహారాష్ట్రలోనూ అమలు చేయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు మహారాష్ట్రలో సమారు తొమ్మిది వేల మంది రైతులు రుణభారం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని గణాంకాలు చెప్తున్నాయి.

మరోవైపు పంజాబ్ రాష్ట్రంలోనూ పంట రుణాల భారం తట్టుకోలేక రైతులు బలవన్మరణాలకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రుణాల మాఫీకి ఇచ్చిన హామీతో అధికారంలోకి వచ్చిన పంజాబ్ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తమకు చేయూతనివ్వాలని ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీని అభ్యర్థించారు. ఇక తమిళనాడు రైతులతో జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.

 మహారాష్ట్రలోనే పంట రుణాల సంక్షోభం

మహారాష్ట్రలోనే పంట రుణాల సంక్షోభం

వాస్తవంగా మహారాష్ట్రలోనే వ్యవసాయ సంక్షోభం వల్ల దేశంలోనే అత్యధికంగా రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత స్థానంలో పంజాబ్ రాష్ట్రం చిక్కుకున్నది. ఇదిలా ఉంటే పంట రుణాల మాపీ విషయమై ఒకవైపు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని రుణ మాఫీపై మిత్రపక్షం శివసేన ప్రశ్నిస్తుండగానే మరోవైపు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఆధ్వర్యంలో సంఘర్ష్ యాత్ర నిర్వహించగా, మాజీ సీఎం అశోక్ చవాన్ మీడియా ద్వారా బీజేపీ - శివసేన సంకీర్ణ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు.

యూపీ సీఎంపై ఉద్ధవ్ థాకరే ఇలా

యూపీ సీఎంపై ఉద్ధవ్ థాకరే ఇలా

‘చునావీ ఘోష్నా సిర్ఫ్ జుమ్లీ నహీన్ హోతే, యే యోగి జీ నే సాబిత్ కియా హై (ఎన్నికల వాగ్దానాలు ఒక ఏమాత్రం వాక్ఛాతుర్యానికి నిదర్శనం కాదు. యోగి కూడా తన హామీని నిలుపుకున్నారు' అని ఉద్ధవ్ థాకరే గుర్తు చేశారు. రూ. లక్ష రుణం మాఫీ వల్ల యూపీలోని చిన్న, సన్నకారు రైతులంతా కష్టాల నుంచి బయటపడతారు. ఇంకా గోధుమలకు క్వింటాల్ పై కనీస మద్దతు ధర రూ.10 పెంచుతూ మరో నిర్ణయం తీసుకున్నారు యోగి ఆదిత్యనాథ్. ఇది రాష్ట్రంలోని 5000 గోధుమల విక్రయ కేంద్రాల్లో అమలులోకి రానున్నది.

మోడీ, ఫడ్నవీస్ ప్రభుత్వాలపై...

మోడీ, ఫడ్నవీస్ ప్రభుత్వాలపై...

ఇటు రాష్ట్రం.. అటు కేంద్రంలోనూ ప్రభుత్వాల భాగస్వామ్య పక్షమైనా శివసేన మాత్రం.. మంచి నిర్ణయాలకు అభినందిస్తూ, ప్రతికూల వైఖరిపై విమర్శలు చేయడానికి వెనుకాడటం లేదు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముంబై నగర అవసరాల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఇటీవల జరిగిన బ్రుహన్ ముంబై నగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో విమర్శించారు.

 మహారాష్ట్రలో పునరేకీకరణ దిశగా...

మహారాష్ట్రలో పునరేకీకరణ దిశగా...

ఇదిలా ఉంటే మహారాష్ట్రలో పంట రుణాల మాఫీ అమలు చేయాలన్న డిమాండ్‌తో సాగిన విపక్షాల తొలి దశ ‘సంఘర్ష్ యాత్ర' రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగనున్నదన్న సంకేతాలిచ్చింది. పంట రుణ మాఫీ పొందే వరకు తమ ఆందోళన ఆగదని సంఘర్ష్ యాత్రలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన సంఘర్ష్ యాత్ర ముగింపు సభలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా ప్రముఖ రాజకీయ నేతలు పాల్గొన్నారు.

ఉమ్మడి పోరు దిశగా...

ఉమ్మడి పోరు దిశగా...

మంగళవారం జరిగిన తొలిదశ సంఘర్ష్ యాత్ర ముగింపు సభలో శరద్ పవార్ మాట్లాడుతూ తమ డిమాండ్ సాధించుకునేందుకు వివిధ పార్టీలు సమన్వయంతో కూడిన రాజకీయ వ్యూహం అమలు చేస్తూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. పంట రుణాల మాఫీతోపాటు రైతుల ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ విపక్షాలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. మాజీ సీఎం, మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ చవాన్ మాట్లాడుతూ రైతుల సమస్యలపై విపక్షాలు ఉమ్మడి పోరాటం చేస్తాయన్నారు.

విదర్భ, మరఠ్వాడలో...

విదర్భ, మరఠ్వాడలో...

తీవ్ర కరువు సమస్యలు ఎదుర్కొంటున్న విదర్భ, మరఠ్వాడ ప్రాంతాల్లోని 16 జిల్లాల మీదుగా తొలి దశ సంఘర్ష్ యాత్ర గత నెల 29వ తేదీ నుంచి ఈ నెల నాలుగో తేదీ వరకు సాగింది. విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు 3000 కిలోమీటర్ల దూరం సంఘర్ష్ యాత్రలో పాల్గొన్నారు. తదుపరి దశలో విపక్షాల ఆధ్వర్యంలో పంట రుణాల మాఫీ కోసం ఉమ్మడిగా పోరాటాన్ని ఉధ్రుతం చేసేందుకు రంగం సిద్ధమవుతున్నది. శరద్ పవార్, అశోక్ చవాన్ కూడా తదుపరి ఆందోళనలో పాల్గొననున్నట్లు ప్రకటించారు.

మూడేళ్లైనా నెరవేరని మోడీ పంట రుణ మాఫీ

మూడేళ్లైనా నెరవేరని మోడీ పంట రుణ మాఫీ

పంట రుణాలు మాఫీ చేస్తానని ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన హామీ ఇప్పటికిని నెరవేర్చలేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గుర్తు చేశారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్ 2008లో దేశవ్యాప్తంగా రూ.71 వేల పంట రుణాలు మాఫీ చేశారని, కానీ కాంగ్రెస్ పార్టీ గానీ, యూపీఏ భాగస్వామ్య పక్షాలు గానీ ఎటువంటి ఎన్నికల హామీ ఇవ్వలేదని ప్రకటించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా నాడు మన్మోహన్ సింగ్ నిర్ణయం తీసుకున్నారని, కానీ ప్రధాని మోదీ తన వాగ్దానాన్ని నిలుపుకోలేదని తెలిపారు.

పంట రుణాలు స్వల్పం..

పంట రుణాలు స్వల్పం..

దేశంలోని 20 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలు తీసుకున్న రూ. 2.8 ట్రిలియన్ల రుణాలు రద్దు చేసేశాయని పవార్ చెప్పారు. కార్పొరేట్ సంస్థల రుణాలతో పోలిస్తే రైతులు తీసుకున్న పంట రుణాల భారం అంత ఉండదని, కానీ ప్రధాని మోదీ గానీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గానీ ఎంతో సున్నితమైన రైతుల సమస్యను మాత్రం తీవ్రంగా పరిగణించడం లేదని ఆక్షేపించారు.

రుణాల మాఫీలో కేంద్రం వివక్షపై మరాఠీల కినుక

రుణాల మాఫీలో కేంద్రం వివక్షపై మరాఠీల కినుక

యూపీతో పోలిస్తే వ్యవసాయ సంక్షోభం ఎదుర్కొంటున్న రాష్ట్రం మహారాష్ట్ర, కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నాయని మరాఠీ రైతులు విమర్శిస్తున్నారు. మరోవైపు రైతుల పంట భూములతో సంబంధం లేకుండా వారు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలన్నీ మాఫీ చేయాలని మంగళవారం మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర విపక్షం గుర్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై పడే పంట రుణాల భారాన్ని కేంద్రం కూడా భరించాలని మద్రాస్ హైకోర్టు చెప్పిన సంగతి విపక్ష నేతలు సంఘర్ష్ యాత్రలో ప్రస్తావించడం గమనార్హం.

బాంబే హైకోర్టును ఆశ్రయిస్తామన్న ఎన్సీపీ

బాంబే హైకోర్టును ఆశ్రయిస్తామన్న ఎన్సీపీ

మద్రాస్ హైకోర్టులో మాదిరిగానే బాంబే హైకోర్టులోనూ పంట రుణాలు మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ విదర్భ, మరఠ్వాట, ముంబై ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పిటిషన్లు వేస్తామని ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవ్హద్ తెలిపారు.

 పోలిక లేదంటున్న మరాఠీ బీజేపీ నేతలు

పోలిక లేదంటున్న మరాఠీ బీజేపీ నేతలు

మహారాష్ట్ర రైతుల పంట రుణాలకు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సారూప్యత లేదని మహారాష్ట్ర బీజేపీ నేతలు అనధికారిక చర్చల్లో చెప్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి మిత్రపక్షం శివసేన మొదలు విపక్షాలు పంట రుణాలు మాఫీ చేయాలన్న డిమాండ్‌ను ఫడ్నవీస్ ప్రభుత్వం పెడచెవిన బెడుతున్నదన్న విమర్శలు ఉన్నాయి. నైతికంగా తాము మహారాష్ట్రలో పంట రుణాలు మాఫీ చేస్తామన్న హామీనివ్వలేదని, కానీ యూపీలో హామీ ఇచ్చామని పేరు చెప్పడానికి ఇష్ట పడని బీజేపీ నేత ఒకరు తెలిపారు. యూపీతో పోలిస్తే మహారాష్ట్రలో పంట రుణాల మొత్తం చాలా తక్కువని పేర్కొన్నారు.

31 లక్షల మంది రైతులపై రుణ భారం

31 లక్షల మంది రైతులపై రుణ భారం

కానీ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారం 31 లక్షల మంది రైతులు రూ.30,500 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రైతులు తీసుకున్న రుణాల కంటే కొద్దిగా తక్కువ అని బీజేపీ నేతలు చెప్తున్నారు. 2011 జన గణన ప్రకారం యూపీలో 2.5 ఎకరాల భూమి గల చిన్న, సన్నకారు రైతులు 92 శాతం 23.3 మిలియన్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నివేదిక ప్రకారం పంట రుణాల విలువ మొత్తం రూ.27,429.70 కోట్లు ఉంటాయని తెలుస్తున్నది.

యూపీతోపాటు మహారాష్ట్ర వర్తిస్తుందిలా..

యూపీతోపాటు మహారాష్ట్ర వర్తిస్తుందిలా..

కానీ మహారాష్ట్ర రైతు హక్కుల కార్యకర్త విజయ్ జవాంధియా మాట్లాడుతూ ‘ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది ప్రధాని నరేంద్రమోడీ తప్ప, బీజేపీ యూపీ శాఖ మాత్రం కాదు. అప్పటి నుంచి యూపీలో బీజేపీ ప్రభుత్వం పంట రుణాల మాఫీకి కట్టుబడి ఉన్నప్పుడు. అదే పార్టీ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలా తప్పించుకోగలుగుతుంది' అని ప్రశ్నించారు.

కాంగ్రెస్, ఎన్సీపీ నేతలకే లబ్ది చేకూర్చిందన్న ఫడ్నవీస్

కాంగ్రెస్, ఎన్సీపీ నేతలకే లబ్ది చేకూర్చిందన్న ఫడ్నవీస్

2008లో యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన రూ.71 వేల పంట రుణాల మాఫీ కేవలం మహారాష్ట్రలోని కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేతలే స్వాహా చేశారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. దీన్ని జవాంధియా వ్యతిరేకించారు. నాటి రుణ మాఫీతో 2008లో 75 శాతం రైతులు లబ్ది పొందారని అన్నారు. ప్రతి రైతు రూ.20 వేల రుణం మాఫీ పొందాడని గుర్తు చేశారు. తరువాత తాజా పంట రుణాలు తీసుకున్నా.. 2009, 2010లలో వర్షాభావంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని జవాధియా ఆందోళన వ్యక్తం చేశారు.

English summary
The Yogi Adityanath led BJP government in Uttar Pradesh waived off agrarian loans to the tune of Rs 1 lakh in the state on Tuesday. The move was appreciated by Shiv Sena supremo Uddhav Thackeray, the ally cum critic of ruling BJP in Centre and Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X