పహల్గాం ఎటాక్ అసలు విలన్ వీడే..? షాకింగ్ విషయాలు వెలుగులోకి..?
పచ్చని కాశ్మీర్ లో రక్తపు టేరులు పారించారు ఉగ్రవాదులు. వేసవి సెలవుల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభూతి చెందాలని దేశం నలుమూలల నుంచి వచ్చిన టూరిస్టులపై రక్కసి మూకలు మారణ హోమం సృష్టించారు. ఏప్రిల్ 22 న జరిగిన పహల్గాం ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడింది. 26 మంది అభంశుభం తెలియని టూరిస్టులను ఉగ్రమూక బలి తీసుకుంది.
అయితే తాజాగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఈ ఎటాక్ చేయడానికి గల కారణం ఏంటి..? ప్లానింగ్ ఎవరు చేశారు..? అనే దానిపై ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ గా మారుతోంది. పహల్గాం ఉగ్రదాడికి అసలు సూత్రధారి పాక్ చీఫ్ అసిమ్ మునీర్ అని తేలినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ ఎటాక్ ను పర్యవేక్షించింది ISI చీఫ్ అని పాకిస్థాన్ మాజీ సైనికాధికారి మేజర్ ఆదిల్ రాజా అక్కడి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
పాకిస్థాన్ ప్రజల్లో పాక్ చీఫ్ అసిమ్ మునీర్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. తనపై పాక్ పౌరుల్లో ఉన్న అసమ్మతిని మళ్లించడానికే పహల్గాంలో కావాలనే ఉగ్రవాదులతో ఎటాక్ చేపించాడని మేజర్ ఆదిల్ రాజా పేర్కొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. ఐఎస్ఐ చీఫ్ తో చేతులు కలిపి ఈ ఉగ్రదాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

పహల్గాం ఉగ్రదాడిలో మునీర్ తో పాటు పాక్ ఆర్మీలో పని చేస్తున్న ఐదుగురు ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందని మాజీ సైనికాధికారి మేజర్ ఆదిల్ రాజా స్పష్టం చేశారు. ఈ ఎటాక్ కు కారణమైన అధికారుల పేర్లు, ముఖ చిత్రాలు, వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయని మేజర్ ఆదిల్ రాజా తెలిపినట్లు సమాచారం.
అంతేకాక పాకిస్థాన్, ఉగ్రవాదుల మధ్య ఉన్న సంబంధాలు.. పాక్ టెర్రరిస్టులకు ఎలా సపోర్ట్ చేస్తుందో ఈ మేరకు రాజా తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. జమ్ము కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా బైసరన్ లోయలోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రమూకలు జరిపిన మారణహోమంలో 26 మంది మృతి చెందారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి 9 ఉగ్ర స్థావరాలను.. దాదాపు 200మంది ఉగ్రవాదులను హతమార్చింది.












Click it and Unblock the Notifications