రిపబ్లిక్ డే పరేడ్‌లో సరికొత్త చరిత్ర: కర్తవ్య పథ్‌పై ‘ఆపరేషన్ సింధూర్’ గర్జన!

భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కర్తవ్య పథ్ ముస్తాబవుతోంది. ఈ ఏడాది పరేడ్‌లో భారత వైమానిక దళం ప్రదర్శించబోయే 'సింధూర్ ఫార్మేషన్', కొత్తగా ఏర్పాటైన 'భైరవ్ బెటాలియన్' ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గతేడాది పాకిస్థాన్‌పై భారత్ జరిపిన మెరుపు దాడుల (సర్జికల్ స్ట్రైక్) ప్రతిబింబం ఈ వేడుకల్లో కనిపించనుంది.

ఏమిటీ 'సింధూర్ ఫార్మేషన్'?
గతేడాది మే 6వ తేదీ రాత్రి, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' చేపట్టింది. పాకిస్థాన్ భూభాగంలోని 9 ఉగ్రవాద స్థావరాలను మన వాయుసేన నేలమట్టం చేసింది. ఈ విజయాన్ని స్మరిస్తూ, ఈ ఏడాది ఫ్లైపాస్ట్ సమయంలో కనీసం 7 యుద్ధ విమానాలతో 'సింధూర్ ఫార్మేషన్'ను ప్రదర్శించనున్నారు. ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న ఫైటర్ జెట్‌లు ఈ విన్యాసంలో పాలుపంచుకోవడం విశేషం.

Republic Day Parade 2026 Operation Sindoor Formation and Bhairav Battalion to Debut at Kartavya Path

రంగంలోకి 'భైరవ్ బెటాలియన్'
ఈసారి పరేడ్‌లో ఆర్మీకి చెందిన కొత్త విభాగం 'భైరవ్ బెటాలియన్' తొలిసారిగా కవాతు చేయనుంది. సాధారణ పదాతి దళం, స్పెషల్ ఫోర్సెస్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఈ దళాన్ని రూపొందించారు. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో అత్యంత వేగంగా, ఘోరంగా దాడి చేసే సామర్థ్యం వీరికి ఉంటుంది. ఇందులో కేవలం పదాతి దళమే కాకుండా ఎయిర్ డిఫెన్స్, ఆర్టిలరీ, సిగ్నల్ విభాగాల సైనికులు కూడా ఉంటారు. సరిహద్దు దాటి శత్రువుల సమాచారాన్ని సేకరించడం, వారి కార్యకలాపాలను అడ్డుకోవడంలో భైరవ్ బెటాలియన్ కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా పారా స్పెషల్ ఫోర్సెస్ మరింత వ్యూహాత్మక మిషన్లపై దృష్టి పెట్టే అవకాశం కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+