Exit Poll Republic-PMARQ: కేంద్రంలో మళ్లీ ఎన్డీయే- భారీ మెజార్టీతో హ్యాట్రిక్ ఖాయం..!
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా రిపబ్లిక్-పీమార్ క్యూ ఎగ్జిట్ పోల్ కూడా ఫలితాలు విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమికీ, ఇండియా కూటమికీ మధ్య జరిగిన పోరులో ఏం జరిగిందో తేల్చేసింది. ఎన్డీయే కూటమి ఈసారి 359 సీట్లు సాధించి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తేలింది.

లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 359 సీట్లు లభిస్తాయని, ఇండియా కూటమికి కేవలం 154 సీట్లు మాత్రమే లభిస్తాయని రిపబ్లిక్ టీవీ-పీమార్ క్యూ ఎగ్జిట్ పోల్ లో తేలింది. ఇతరులకు 30 సీట్లు లభిస్తాయని రిపబ్లిక్ పోల్ తేల్చింది. ఈసారి ఎన్డీయే కూటమి టీడీపీ, జనసేనతో పాటు పలు కొత్త మిత్రులను కలుపుకుని పోటీ చేసింది. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి హ్యాట్రిక్ విజయం సాధించబోతోందని రిపబ్లిక్ టీవీ తేల్చేసింది.
విపక్షంలో ఉన్న కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, డీఎంకే వంటి పార్టీలు ఈసారి కూడా అంత మెరుగైన ప్రదర్శన చేయలేకపోయినట్లు రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ తేల్చింది. దీంతో ఈసారి కూడా విపక్షాలకు నిరాశ తప్పడం లేదని తేలిపోయింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన ఏమాత్రం మెరుగుపడలేదని ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications