షాక్: సునంద పుష్కర్ మృతి: ఆడియో టేపులు బయటపెట్టిన అర్నబ్ గోస్వామి!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసు ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చింది. సునంద పుష్కర్ మృతి చెందిన గది నుంచి మరో గదికి ఆమె మృతదేహం తరలించారని అర్నబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవీ చానల్ బాంబు పేల్చింది.
అంతే కాకుండా సునంద పుష్కర్ మృతి చెందిన స్టార్ హోటల్ లోనే ఆసమయంలో ఆమె భర్త శశి థరూర్ కూడా ఉన్నారని వార్తలు ప్రసారం చేసింది. శశి థరూర్, ఆయన సన్నిహితుడు మద్య జరిగిన సంభాషణలు ఇవే అంటూ ఓ ఆడియో టేపు విడుదల చెయ్యడంతో కాంగ్రెస్ వర్గాలు హడలిపోయాయి.
{photo-feature}


Click it and Unblock the Notifications