నిద్రపోనివ్వం: ఎమ్మెల్యేల కొనుగోలుపై విచారణ, యడ్యూరప్ప, బళ్లారి బ్రదర్స్, రామలింగా రెడ్డి!
Recommended Video

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నాలు చేసిన బీజేపీ నాయకుల మీద విచారణ జరిపించాలని మనవి చేస్తామని ఆ రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి అన్నారు. బీఎస్ యడ్యూరప్పను సీఎం చేసి కర్ణాటకను లూటీ చెయ్యాలని బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ ప్రయత్నాలు చేశారని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి ఆరోపించారు. బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో సోమవారం రామలింగా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఆపరేషన్ కమల
బీజేపీ నాయకులు ఆపరేషన్ కమల పేరుతో భారీ మొత్తంలో నగదు ఆశ చూపించి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యాలని ప్రయత్నాలు చేశారని, ఆ ఆడియో క్లిప్పింగ్స్ బయటకు వచ్చాయని మాజీ హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు.

నకిలీ ఆడియో క్లిప్పింగ్
ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకులు ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రామలింగా రెడ్డి ఆరోపించారు. బీజేపీ నాయకులు ఎన్ని నాటకాలు అడినా విచారణలో అసలు విషయాలు వెలుగు చూస్తాయని, ఎవ్వరూ తప్పించుకోలేరని రామలింగా రెడ్డి అన్నారు.

ఢిల్లీ డబ్బులా, లూటీ డబ్బులా
2008 నుంచి 2013 వరకు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసింది అనే విషయం అందరికీ తెలిసిందే అని రామలింగా రెడ్డి అన్నారు. 2008 నుంచి 2013 వరకూ కర్ణాటకలో లూటీ చేసిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యాలని చూశారా, లేదా ఢిల్లీ నుంచి డబ్బులు వస్తున్నాయా అని రామలింగా రెడ్డి బీజేపీ నాయకులను ప్రశ్నించారు.

నిద్రపోనివ్వం
కాంగ్రెస్, జేడీఎస్ నాయకులను నిద్రపోనివ్వం అని బీజేపీ నాయకులు హెచ్చరించారని రామలింగా రెడ్డి గుర్తు చేశారు. కర్ణాటకలో అధికారంలోకి వస్తామని అవినీతిలో కూరుకుపోయిన బీఎస్. యడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి సోదరులు కలలుకన్నారని రామలింగా రెడ్డి ఆరోపించారు. అధికారం చెయ్యిజారి పోవడంతో ఇప్పుడు వారికి నిద్రరావడం లేదని రామలింగా రెడ్డి వ్యంగంగా అన్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications