జార్ఖండ్ లో రిసార్ట్ రాజకీయాలు మొదలు-ఎమ్మెల్యేలతో కలిసి క్యాంప్ కు సోరెన్

జార్ఖండ్ లో సొంతానికి గనులు కేటాయించుకున్న వ్యవహారంలో సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటుకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే ఈసీ నుంచి వచ్చిన సిఫార్సుల్ని ఆమోదించి గవర్నర్ తిరిగి ఈసీకి పంపినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈసీ సోరెన్ పై అనర్హత వేటువేస్తూ ఏ క్షణాన అయినా నోటిఫికేషన్ విడుదల చేయొచ్చని తెలుస్తోంది. దీంతోపాటే జార్ఖండ్ లో రాజకీయాలు ఊపందుకున్నాయి.

సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు పడగానే ఆయన పార్టీ జేఎంఎం ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చన్న సంకేతాలు కూడా అందుతున్నాయి. దీంతో యూపీఏ కూటమి తమ ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తోంది. ఇవాళ సాయంత్రం రాంచీలో యూపీఏ ఎమ్మెల్యేల భేటీ జరగనుండగా.. అంతకు ముందే ఎమ్మెల్యేలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు సీఎం హేమంత్ సోరెన్ వారిని క్యాంపుకు తరలించారు. బస్సుల్లో యూపీఏ ఎమ్మెల్యేలతో కలిసి క్యాంప్ కు వెళ్తున్న ఫొటోల్ని సైతం ఆయన షేర్ చేశారు.

resort politics begin jharkhand amid sorens disqualification suspense, cm camp with mlas

ఎమ్మెల్యేలను జార్ఖండ్‌లోని లట్రాటు డ్యామ్ సమీపంలోని ప్రదేశానికి తరలించారు. మూడు బస్సుల్లో అధికార జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ సంకీర్ణ ఎమ్మెల్యేలు వెళ్లారు. వీరికి భద్రతా సిబ్బంది కాపలాగా ఉన్నారు. అంతకు ముందు హేమంత్ సోరెన్ ఎమ్మెల్యేగా "అనర్హత" వేటుకు గురవుతారనే వార్తల నేపథ్యంలో రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి అవసరమైన వ్యూహాన్ని రూపొందించడానికి అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నివాసంలో సమావేశమయ్యారు. అధికార ఎమ్మెల్యేలు తమ లగేజీతో పాటు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం తరువాత, హేమంత్ సోరెన్‌తో పాటు అధికార జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ సంకీర్ణ శాసనసభ్యులు లాట్రాటు డ్యామ్ సమీపంలోని ప్రదేశానికి వెళ్లారు.

ప్రస్తుతం పాలక శాసనసభ్యులు క్యాంపులు ఉన్న లాట్రాటు డ్యామ్‌కు వెళ్లే రహదారులను అధికారులు బ్లాక్ చేశారు. కాలినడకన కూడా రోడ్లపై వెళ్లేందుకు మీడియాకు అనుమతి లేదు. సంకీర్ణాన్ని నిలబెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు పిటిఐకి తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+