"హిందీకి అన్ని రంగాల్లో స్థానం కల్పించాలి"

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీ భాషపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సైన్స్, టెక్నాలజీ, న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థకు హిందీ భాషగా ఉండాలన్నారు. ప్రాంతీయ భాషలకు హిందీ పోటీ కాదని కేవలం ఫ్రెండ్ మాత్రమేనని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 14 హిందీ దివాస్ సందర్భంగా గుజరాత్ లోని గాంధీ నగర్ లో జరిగిన ఐదవ అఖిల భారత అధికార భాష సమ్మేళనంలో అమిత్ షా ప్రసంగించారు.

హిందీ భాషపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర భాషలకు హిందీకుఎలాంటి వివాదం లేదన్నారు. హిందీ భాషను కేవలం సంభాషించుకోడానికి మాత్రమే కాకుండా సైన్స్, టెక్నాలజీ, న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలో అనుసంధానం చేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 14 హిందీ దివాస్ సందర్భంగా గుజరాత్ లోని గాంధీ నగర్ లో జరిగిన ఐదవ అఖిల భారత అధికార భాషా సమ్మేళనంలో అమిత్ షా ప్రసంగించారు.

ప్రజలు వారి ప్రాంతీయ భాషలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే పిల్లలతో తల్లిదండ్రులు ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. " హిందీ భాషకు ఇతర ప్రాంతీయ భాషలకు మధ్య ఎలాంటి వివాదం లేదు. దయానంద సరస్వతి, మహాత్మా గాంధీ, కేఎమ్ మున్షీ, సర్ధార్ లాంటి ఎందరో మహానుభావులు హిందీని నేర్చుకోవడమే కాకుండా ప్రోత్సహించారు. గుజరాత్ లో గుజరాతీ, హిందీ కలిసి అభివృద్ధి చెందుతున్నాయి. ఇది బెస్ట్ ఉదాహరణ" అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

Respect All Languages Boost Hindi Amit Shah s Vision for Viksit Bharat

అలాగే తమ మాతృభాషలోనే లేఖలు రాయాలంటూ రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. అంతేకాకా అంతర్జాతీయ వేదికలపై హిందీ భాషకు ప్రధాని మోదీ గౌరవం పెంచారని ప్రశంసించారు. ఈ మేరకు పిల్లలకు మాతృభాషలోనే బోధించాలని తల్లిదండ్రులకు సూచనలు చేశారు. పిల్లలు తమ మాతృభాషలో చదివితేనే విజ్ఞానం పెరుగుతుందని వేరే భాషలో చదివితే వారి అభ్యాస సామర్థ్యం 30 శాతం తగ్గిపోతుందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+