వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త కరెన్సీ ప్రాణాలు తీసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హర్యానా :పెద్ద నగదు నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నగదు కోసం బ్యాంకులు, ఎటిఎం ల వద్ద బారులు తీరుతూ చనిపోయిన ఘటనలు చూశాం. కాని, కాని, ప్రజలకు పైసలు ఇస్తూనే ఓ బ్యాంకు అధికారి తన ప్రాణాలను కోల్పోయాడు. పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతోంది.

పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం కారణంగా బ్యాంకు అధికారులకు కంటి మీద కునకు లేకుండా పోయింది.బ్యాంకు సమయానికి కంటే ముందుగానే రావడం, బ్యాంకు సమయం ముగిసిన తర్వాత కూడ గంటల తరబడి బ్యాంకుల్లో పనిచేయడం బ్యాంకు ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది.

restless for new currency to customers bank manager dead in bank

పెద్దనగదు నోట్ల వ్యవహారం హర్యానా రాష్ట్రంలో ఓ బ్యాంకు అధికారి ప్రాణాలను తీసింది. ఖాతాదారులకు డబ్బులిస్తూనే ప్రాణాలను కోల్పోయాడు.ఈ ఘటనతో బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులు కంటతడిపెట్టారు.

హర్యానా రాష్ట్రానికి చెందిన రాజేష్ కుమార్ రోహ్తక్ కో పరేటివ్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ప్రతి రోజూ ఎక్కువ సమయం బ్యాంకులోనే గడుపుతున్నాడు. అసలే ఆయనకు గుండెజబ్బు.. మూడు రోజులుగా పనిఒత్తిడి పెరిగింది. పైగా విశ్రాంతి కూడ లేదు.రాత్రి, పగలనే తేడా లేకుండా బ్యాంకులోనే గడుపుతున్నాడు బ్యాంకు మేనేజర్ బుదవారం నాడు ఉదయం పూట ఖాతాదారులకు డబ్బులు ఇస్తూ తన సీట్లనే కుప్పకూలిపోయాడు. బ్యాంకు సిబ్బంది వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన అప్పటికే చనిపోయారని వైద్యులు ప్రకటించారు.

English summary
new currency distrubation is a big task,bank an employees suffer. rakesh kumar working as a bank manager in rohatak cooperative bank. last three days he is stay in bank for distribute new currency.on wednesday morning he is dead .he is suffering from heart attack. withour rest , continuiosely working is the reason said doctors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X