దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం: నవంబర్‌లో 5.88 శాతంగా నమోదు
న్యూఢిల్లీ: దేశంలో కొద్ది నెలలుగా ఆకాశం వైపు చూస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణం ఎట్టకేలకు దిగివచ్చింది. భారత ద్రవ్యోల్బనం లేదా వినియోగదారుల ధరల సూచి(సీపీఐ) అక్టోబర్‌లో 6.77 శాతం ఉండగా.. నవంబర్ నెల నాటికి 5.88 శాతానికి దిగివచ్చింది.
ప్రధానంగా ఆహార పదార్థాల ధరలు తగ్గించడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. 11 నెలల్లో ఈ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతేగాక, భారత రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న లక్ష్యానికి 4(+/-2) శాతానికి లోపే నమోదు కావడం విశేషం. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం సోమవారం వెలువరించింది.
గత ఏడాది నవంరబ్ నెలలో 4.91 శాతంగా ఉన్న వినియోగదారుల ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గత కొన్ని నెలలుగా 6 శాతానికి పైనే నమోదవుతూ వస్తోంది. అక్టోబర్ నెలలో కూడా 6.77 శాతం నమోదైంది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. మొత్తంగా చూసుకుంటే 2.25 శాతం మేర పెంచింది.

తాజా సమాచారం ప్రకారం.. గ్రామీణ సీపీఐ అక్టోబర్‌లో 6.98 శాతం నుంచి నవంబర్‌లో 6.09 శాతానికి తగ్గగా, అర్బన్ సీపీఐ అక్టోబర్‌లో 6.50 నుంచి నవంబర్‌లో 5.68 శాతానికి తగ్గింది.
ద్రవ్యోల్బణం కట్టడికి అర్జుడినిలా దృష్టి సారించామని పేర్కొన్న భారత రిజర్వ్ బ్యాంక్.. ఆశించిన ఫలితం దాదాపు సాధించిందనే చెప్పాలి. అయితే, రాబోయే 12 నెలలు మాత్రం 4 శాతానికి ఎగువనే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications