7 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం, వచ్చే నెలలో తగ్గే ఛాన్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 7 నెలల గరిష్టానికి చేరుకొంది. అక్టోబర్‌ నెలలో ఈ ద్రవ్యోల్బణ 3.58 శాతానికి పెరిగింది. ఈ ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐ ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటుంది. డిసెంబర్‌ 6న ఆర్‌బీఐ పాలసీ మీటింగ్‌ జరుగనుంది.

దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్టానికి చేరుకొంది. దీని ప్రభావం ధరలపై పడనుంది. ద్రవ్యోల్బణం ఆధారంగానే ఆర్‌బిఐ కీలక నిర్ణయాలు తీసుకొంటుంది.

7 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం

7 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం

దేశీయ రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్టానికి చేరింది. ఆహార, ఇంధన ధరలు బాగా పెరగడంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగినట్టు వెల్లడైంది.వినియోగదారుల ధరల సూచీ ద్వారా ఈ రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని గణిస్తారు. రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా రేట్ల కోతకు రిటైల్‌ ద్రవ్యోల్బణం ముఖ్యమైనది. ఈ ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐ ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటుంది. డిసెంబర్‌ 6న ఆర్‌బీఐ పాలసీ మీటింగ్‌ జరుగనుంది.

వచ్చే నెలలో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం

వచ్చే నెలలో ద్రవ్యోల్బణం తగ్గే అవకాశం


రెండు రోజుల క్రితం జిఎస్టీ కౌన్సిల్ 178 ఉత్పత్తుల ధరలను 28 శాతం నుంచి 18 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకొంది. దీని కారణంగా వచ్చే నెలల్లో ఈ రిటైల్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గే అవకాశాలున్నాయని పలువురు విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

 జూన్ నుండి పెరుగుతున్న ద్రవ్యోల్బణం

జూన్ నుండి పెరుగుతున్న ద్రవ్యోల్బణం


ఈ ఏడాది జూన్‌ నుండి రిటైల్‌ ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. అదేవిధంగా హౌజింగ్‌ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. సెప్టెంబర్‌లో 6.1 శాతంగా ఉన్న హౌసింగ్‌ ద్రవ్యోల్బణం 6.68 శాతానికి ఎగిసింది. అంచనావేసిన దానికంటే స్వల్పంగా వార్షిక పారిశ్రామికోత్పత్తి పెరిగింది.

 పారిశ్రామిక ఉత్పత్తి 4.2 శాతం పెరిగే అవకాశం

పారిశ్రామిక ఉత్పత్తి 4.2 శాతం పెరిగే అవకాశం


సెప్టెంబర్‌లో ఈ ఉత్పత్తి 3.8 శాతం పెరిగినట్టు తెలిసింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం వార్షిక పారిశ్రామికోత్పత్తి 4.2 శాతం పెరుగుతుందని రాయిటర్స్‌ పోల్‌లో వెల్లడైంది.ద్రవ్యోల్బణం ఆధారంగా ఆర్బీఐ వచ్చే నెల 6వ, తేదిన జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Costlier food items, particularly vegetables, pushed up retail inflation in October to seven-month high of 3.58%.The Consumer Price Index-based inflation was 3.28% in September.It was 4.2% in October last year. The previous high was 3.89% in March this year.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి